బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక సినిమా మంచి కలెక్షన్స్ ని సాధించాలి అంటే ఆ సినిమా కి పాజిటివ్ టాక్ చాలా అవసరం, కానీ ఆ సినిమాకి బజ్ ఏర్పడాలి అంటే మాత్రం ఆ సినిమా సాంగ్స్, టీసర్ మరియు ట్రైలర్ లు ఆకట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది…
కొన్ని క్రేజీ మూవీస్ కి ట్రైలర్ లు కనుక క్లిక్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ సినిమా సాలిడ్ గా జంప్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది, కానీ ట్రైలర్ క్లిక్ అవ్వకపోతే ఆ సినిమా ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ ఎంతైనా ఉంటుంది… లేటెస్ట్ గా రిలీజ్ కి ఇంకా టైం ఉన్నప్పటికీ…
ఫస్ట్ పార్ట్ హ్యుమంగస్ సక్సెస్ వలన పార్ట్ 2 తో సాలిడ్ హైప్ ను సొంతం చేసుకున్న సినిమా చంద్రముఖి2(Chandramukhi2)…రాఘవ లారెన్స్ కంగనా రనౌత్ ల కాంబోలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ హైప్ వలన ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు జస్ట్ సీక్వెల్ హైప్ మీద…
అన్ని చోట్లా సాలిడ్ బజ్ ను బిజినెస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఆ ట్రైలర్ ను చూసిన తర్వాత చంద్రముఖి సీక్వెల్ గా కాదు, పారడీ వర్షన్ లా చంద్రముఖి2…..
ఉండబోతుందని ట్రైలర్ చూస్తె అనిపిస్తుందని మిక్సుడ్ రెస్పాన్స్…అన్ని చోట్లా స్ప్రెడ్ అవ్వగా సినిమా మీద ఉన్న బజ్ ఇప్పుడు ఒక్కసారిగా స్లో డౌన్ అయిపోయింది…. దాంతో సినిమా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కానుండగా లారెన్స్ నటించిన….
కాంచన3 కూడా ఇలానే ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మిక్సుడ్ రెస్పాన్స్ రాగా కలెక్షన్స్ మాత్రం ఏక లెంట్ గా కుమ్మింది. ఇక చంద్రముఖి2 కూడా ఇలాంటి రిజల్ట్ నే రిపీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాలి ఇప్పుడు.
Waste Brother