Home గాసిప్స్ 606 కోట్లు కొట్టిన రజినీతో పోటికి సై అంటున్న సూర్య!

606 కోట్లు కొట్టిన రజినీతో పోటికి సై అంటున్న సూర్య!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న స్టార్స్ లో కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(SURIYA) ఒకరు….తన లాస్ట్ మూవీ ఈటీ వచ్చి కూడా రెండేళ్ళు అయిపోగా తను ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ అయిన కంగువ(Kanguva Movie) సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

తన కెరీర్ టర్నింగ్ మూవీస్ లో ఒకటిగా ఈ సినిమా నిలుస్తుంది అన్న నమ్మకంగా ఉన్న సూర్య ఈ ఇయర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా ఇప్పుడు క్లాష్ కి సిద్ధం అవుతున్నారు అని కోలివుడ్ లో స్ట్రాంగ్ టాక్ ఉంది…లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర జైలర్(Jailer Movie) తో ఎపిక్ కంబ్యాక్ ను…

606 కోట్ల మమ్మోత్ గ్రాస్ ను అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటిస్తున్న కొత్త సినిమా వేటయ్య(Vetayya Movie మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. ఈ సినిమా ను ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ అవుతుందని ఆల్ రెడీ ఫిబ్రవరి టైంలోనే అనౌన్స్ చేశారు…కాగా ఇప్పుడు సూర్య నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ అయిన…

కంగువ మూవీ కూడా దీపావళి టైంకే బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కాబోతుందని లేటెస్ట్ గా టాక్ అయితే వినిపిస్తుంది….పాన్ ఇండియా రేంజ్ మంచి బజ్ ఉన్న రెండు సినిమాలు ఒకే టైంలో పోటి పడతాయి అని కచ్చితంగా చెప్పలేం కానీ తమిళ్ లో దీపావళి సీజన్ కి మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఆ టైం కి పోటి ఉండే అవకాశం ఉందని అంటున్నారు…

సూర్యకి బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇప్పుడు చాలా అవసరం, అదే టైంలో జైలర్ లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత స్పెషల్ రోల్ లో చేసిన లాల్ సలామ్ తో ఎపిక్ డిసాస్టర్ ను అందుకున్న రజినీకాంత్ కూడా మళ్ళీ సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు. మరి ఇద్దరూ తమ లేటెస్ట్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటారో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here