Home న్యూస్ చిన్న సినిమా మీద పెద్ద భారం….ఏమవుతుందో ఇక!

చిన్న సినిమా మీద పెద్ద భారం….ఏమవుతుందో ఇక!

0

టాలీవుడ్ లో ఈ ఇయర్ మార్చ్ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా హిట్ గీతని దాటలేదు…వరుస పెట్టి చిన్నా చితకా సినిమాలు రిలీజ్ అయినా కూడా ఏవి కూడా ఆడియన్స్ ను అలరించలేకపోయాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సినిమాలు లేక…..

సింగిల్ స్క్రీన్స్ ను కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఏర్పడింది…ఇలాంటి టైంలో క్లోజ్ అయిన థియేటర్స్ ని తిరిగి ఓపెన్ చేసే భాద్యత ఇప్పుడు ఒక చిన్న సినిమా మీద పడింది….ఈ నెల 25న IPL ఫైనల్ వీకెండ్ హడావుడిలో ఆడియన్స్ ముందుకు దిల్ రాజు తమ్ముడి కొడుకు ఆశిష్(Ashish) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ….

లవ్ మీ(Love Me Movie) ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది…యూనిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రామిసింగ్ గానే కనిపిస్తూ ఉండగా మే 31 వీకెండ్ లో కొన్ని బెటర్ నోటబుల్ మూవీస్ రిలీజ్ కానుండగా… వాటి కన్నా ముందు ఎంతో కొంత ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకునే అవకాశం….

లవ్ మీ సినిమా మీద ఉండగా టాప్ ప్రొడక్షన్ హౌసెస్ లో ఒకటైన దిల్ రాజు నిర్మాణంలో సినిమా అవ్వడం, మంచి రిలీజ్ నే సొంతం చేసుకుంటూ ఉండటంతో కంటెంట్ వర్కౌట్ అయితే జనాలు వీకెండ్ లో థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉందని చెప్పాలి… మరి ఈ చిన్న సినిమా సమ్మర్ లో మూసేసినా థియేటర్స్ ని తిరిగి తెరిపించి ఆక్యుపెన్సీని ఎంతవరకు పెంచగలుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here