Home న్యూస్ రామ్ చరణ్ కి గాయం…RRR షూటింగ్ ఆగిపోయింది

రామ్ చరణ్ కి గాయం…RRR షూటింగ్ ఆగిపోయింది

0

  

   టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కలయికలో తెర కెక్కు తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ RRR సినిమా షూటింగ్ శర వేగంగా జరుగు తుండగా అనుకోని అవాంతరం ఎదురైంది, సినిమా కోసం కష్టపడుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రోజు జిమ్ చేస్తున్నట్లే ఈ రోజు కూడా జిమ్ చేస్తుండ గా…

అనుకోకుండా కాలికి దెబ్బ తగిలింది, దాంతో సినిమా షూటింగ్ సడెన్ గా ఆగిపోవాల్సి వచ్చింది, ఈ విషయాన్నీ ఇటు రామ్ చరణ్ అటు సినిమా యూనిట్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్…

రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు, కాగా సినిమా షూటింగ్ 3 వారాలు ఆగిపోయినా తర్వాత వారాల్లో సినిమా డిలే షూటింగ్ లో ఈ డిలే అయిన షూటింగ్ ని కంప్లీట్ చేస్తారని సమాచారం, కాగా సినిమా లో ఇతర పాత్రల షూటింగ్ కూడా ఆగిపోయి 3 వారల తర్వాతే తిరిగి మొదలు అవుతుందట.

కాగా ఇప్పటి వరకు సినిమా షూటింగ్ 20% కన్నా ఎక్కువ అవ్వగా అనుకోకుండా జరిగిన ఈ పరిస్థితి వలన కొద్దిగా షూటింగ్ డిలే అయినా సినిమా కి అది పెద్దగా ఎఫెక్ట్ ఉందని అంటున్నారు, ఇక రామ్ చరణ్ దెబ్బ మరీ పెద్దది కాక పోయినా తగినంత సమయం రెస్ట్ తీసుకున్నాకే…

సినిమా షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం, ప్రస్తుతం RRR షూటింగ్ పనులతో పాటు సైరా నిర్మాతగా కూడా బిజీ గా ఉన్న రామ్ చరణ్ సైరా పనులను వేరే టీం కి అప్పగించారట. త్వరలోనే తిరిగి కోలుకుని రామ్ చరణ్ షూటింగ్ కి వెళ్లాలని మనం కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here