బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత సెన్సేషనల్ కంబ్యాక్ ని ఖైదీ నంబర్ 150 తో సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగగ్ర సెన్సేషనల్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసి సత్తా చాటుకోగా మళ్ళీ రెండేళ్ళ కి సైరాతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా లాంగ్ రన్ ని సొంతం చేసుకోలేక పోయాడు. ఇలాంటి టైం లో ఇప్పుడు కొరటాల శివ డైరెక్షన్ లో చేస్తున్న ఆచార్య తో కంబ్యాక్ స్ట్రాంగ్ గా ప్లాన్ చేసున్న చిరు….
ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమాలను కూడా ఇప్పుడు ఒకేసారి మొదలు పెట్టె పనిలో ఉన్న విషయం తెలిసిందే, ముందు లూసిఫర్ రీమేక్ ని మొదలు పెడతాడు అనుకున్నా వేదాలం రీమేక్ ని ముందు సెట్ చేస్తున్న చిరు… ఈ సినిమా మొదలు పెట్టిన తర్వాత… కొంత గ్యాప్ లో…
లూసిఫర్ రీమేక్ ని కూడా పట్టాలు ఎక్కించబోతున్నాడు. కాగా తెలుగు రీమేక్ పనులను ప్రస్తుతం ధృవ ఒరిజినల్ తనీ ఒరువన్ డైరెక్టర్ మోహన్ రాజా చేతిలో పెట్టిన చిరు ప్రస్తుతం మార్పులు చేర్పుల విషయంలో సంతోషంగా ఉన్నారని టాక్ వస్తుండగా ఇక ఈ సినిమా గురించిన మరో న్యూస్ ఒకటి…
ఇప్పుడు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం సినిమా టైటిల్ ని కూడా ఆల్ మోస్ట్ తెలుగు వర్షన్ కి గాను రిజిస్టర్ చేయించారు అని అంటున్నారు. లూసిఫర్ సినిమా తెలుగు టైటిల్ గా “బైర్రెడ్డి” అనుకుంటున్నారని సమాచారం. చిన్నగా పవర్ ఫుల్ గా అనిపించే విధంగా ఉన్న ఈ టైటిల్ ని లూసిఫర్ రీమేక్ కోసం రిజిస్టర్ చేయించారట ఫిల్మ్ ఛాంబర్ లో…
వినడానికి అయితే పవర్ ఫుల్ లానే అనిపిస్తున్న ఈ టైటిల్ సినిమాకి తెలుగు లో ఎంతవరకు ప్లస్ అవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. 2021 లో మెగాస్టార్ నుండి 2 సినిమాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉండగా లూసిఫర్ సినిమా 2022 లో ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం. మరి ఈ టైటిల్ నే ఆల్ మోస్ట్ కన్ఫాం చేస్తారా లేక మరో టైటిల్ ని వెతుకుతారో చూడాలి మరి.