Home గాసిప్స్ చిరు సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్…చిరు ఆన్సర్ ఇది!!

చిరు సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్…చిరు ఆన్సర్ ఇది!!

0

     సోషల్ మీడియా లో ఈ లాక్ డౌన్ సమయం లో జరిగిన అతి కొద్ది మంచి పనుల్లో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఎంట్రీ ఒకటని చెప్పొచ్చు, తన దైన స్టైల్ లో రోజు ట్విట్టర్ లో మెగాస్టార్ హవా కొన సాగుతుంది, ఇక తన సినిమాల కు సంభందించిన విశేషాలతో పాటు ఇతర విశేషాలను ఫ్యామిలీ కబుర్ల ని కూడా అప్పుడప్పుడు ట్వీట్ చేస్తూ అందరి కీ ఆనందాన్ని పంచుతున్నాడు మెగాస్టార్..

ఇక తన సినిమాల అప్ డేట్స్ కూడా ఇస్తున్న మెగాస్టార్ తన అప్ కమింగ్ మూవీస్ లిస్టు మొత్తం అప్ డేట్ చేసిన విషయం తెలిసిందే, అందులో ఆచార్య తర్వాత చేయబోతున్న సినిమా అయిన మళయాళ సూపర్ హిట్ అయిన లూసిఫర్ తెలుగు రీమేక్ గురించి కూడా…

అప్పుడప్పుడు ఆసక్తికరమైన విశేషాలను చెబుతున్న చిరు, ఈ సినిమా గురించిన ఓ లేటెస్ట్ రూమర్ పై స్పందించారు, సినిమా లో 2 ఇంపార్టెంట్ స్పెషల్ రోల్స్ ఉన్నాయి, ఆ రోల్స్ కి గాను మెగా ఫ్యామిలీ హీరోలలో 2 నటిస్తారు అన్న వార్తలు ప్రచారం లో ఉండగా వీటితో పాటు… ఆ రోల్స్ లో ఒకటి…

మెగా ఫ్యామిలీ కి క్లోజ్ అయిన బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించే చాన్స్ ఉందని టాక్ సడెన్ గా స్ప్రెడ్ అయింది. చిన్న రోల్ కోసం బాలీవుడ్ సూపర్ స్టార్ నటిస్తారా అని డౌట్ ఉన్నప్పటికీ ఈ విషయాన్నీ మెగాస్టార్ ని అడగగా… ప్రస్తుతం ఆ సినిమా ఇంకా స్క్రిప్ట్ లో చేంజెస్ జరుగుతూనే ఉన్నాయని…

అది కంప్లీట్ అయ్యాకే ఎవరు నటిస్తారు ఎవరు నటించరు అన్నవి చెప్పగలమని, సల్మాన్ ఖాన్ న్యూస్ రూమర్ మాత్రమె అని చెప్పారు చిరు. కానీ మెగా హీరోల్లో 2 నటించే చాన్స్ మాత్రం గట్టిగానే ఉందని తెలుస్తుంది, ఇది నిజం అయితే ఇది మెగా మల్టీ స్టారర్ మూవీ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here