Home న్యూస్ నంబర్ 1 పై…ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్!!

నంబర్ 1 పై…ఎన్టీఆర్ ఫ్యాన్స్ టార్గెట్!!

2

  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు, రీసెంట్ టైం లో అరవింద సమేత తర్వాత ఎన్టీఆర్ కొత్త సినిమా ఏమి లేక పోవడం తో సోషల్ మీడియా లో పెద్దగా యాక్టివ్ గా లేని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తర్వాత మళ్ళీ ఉగాది నుండి ఆర్ ఆర్ ఆర్ ఫస్ట్ లుక్ టైటిల్, టీసర్ 1 లాంటివి రిలీజ్ అవ్వడం తో తిరిగి యాక్టివ్ అయ్యారు.

ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ కి రిలీజ్ చేసే కామన్ డిస్ప్లే ట్రెండ్ విషయం లో సరికొత్త రికార్డ్ ను అడ్వాన్స్ ట్రెండ్ తో నమోదు చేయగా, ఇన్ని రోజుల్లో ఎన్టీఆర్ బర్త్ డే ఉంటుంది అన్న అడ్వాన్స్ విషెస్ ట్రెండ్ లో కూడా ఆల్ టైం బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకున్నారు.

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సరికొత్త టార్గెట్ బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లోనే బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ రికార్డ్ పవన్ కళ్యాణ్ పేరిట ఉంది, 10.51 మిలియన్ ట్వీట్స్ తో 24 గంటల్లో ఆల్ టైం రికార్డ్ ను సృష్టించారు.

ఇక 2018 లో 2 మిలియన్స్ కి పైగా ట్వీట్స్ పోల్ చేసిన ఫ్యాన్స్ 2019 లో ఎన్టీఆర్ ఫ్యామిలీ లో జరిగిన లాస్ వలన ట్రెండ్ చేయలేదు, దాంతో ఇప్పుడు అన్ని ట్రెండ్స్ రికార్డ్ బ్రేక్ చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఫస్ట్ ప్లేస్ లో పవన్ రికార్డ్ ఉండగా సెకెండ్ ప్లేస్ లో రీసెంట్ గా కోలివుడ్ స్టార్ హీరో అజిత్ బర్త్ డే ట్రెండ్ 8.43 మిలియన్ ట్వీట్స్ తో…

రెండో ప్లేస్ లో ఉండగా మూడో ప్లేస్ లో మహేష్ బర్త్ డే ట్రెండ్ 8.3 మిలియన్ ట్వీట్స్ పోల్ అయ్యాయి. ఇవి ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందు ఉన్న లక్ష్యాలు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మే 20 కి జరిగే ఎన్టీఆర్ బర్త్ డే ట్రెండ్ లో ఎలాంటి సెన్సేషన్ ని క్రియేట్ చేస్తారో చూడాలి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here