స్టార్ హీరోలు అన్నాక ఫ్యాన్స్ ఉంటారు యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు నచ్చని వాళ్ళు ఉంటారు, అందరినీ మ్యానేజ్ చేస్తూ కెరీర్ ని కొనసాగించాల్సి ఉంటుంది. ఇక రెమ్యునరేషన్ విషయంలో భారీ డబ్బులు తీసుకునే వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వానికి టాక్సులు కట్టక తప్పదు. అప్పుడప్పుడు వాళ్ళు టాక్స్ కట్టక పోవడం లాంటి న్యూసులు సోషల్ మీడియా లో లీక్ అయితే ఇక నచ్చని వాళ్ళకి అది పండగ లాంటి న్యూస్ అవుతుంది.
లేటెస్ట్ గా ఇలాంటిదే కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ కి జరిగింది. ఇండియా లో ప్రతీ సినిమా కి హైయెస్ట్ రెమ్యునరేషన్ ని తీసుకునే హీరోలలో ఒకరిగా నిలిచిన విజయ్ 2012 లో కొన్న ఓ కారుకు టాక్స్ కట్టకుండా ఉండటం తో…
ఇప్పుడు కోర్టు సీరియస్ అయింది… వివరాల్లోకి వెళితే 2012 లో విజయ్ ఇంగ్లాండ్ నుండి రోల్స్ రాయస్ ఘోస్ట్ కార్ ను ఇంపోర్ట్ చేసుకున్నాడు. అప్పుడు ఆ కారు ధర 7 కోట్లు… ఇంపోర్ట్ చేసుకునే టైం లో ఇంపోర్ట్ టాక్స్ కట్టిన విజయ్ తర్వాత స్టేట్ టాక్స్ కూడా కట్టాల్సి ఉండగా…
ఇంపోర్ట్ టాక్స్ కట్టిన కారణంగా స్టేట్ పర్మిట్ టాక్స్ ని మినహాయింపు ఇవ్వాలని కోరాడట స్టేట్ కోర్టుని, తను యాక్టర్ ని అని చెప్పకుండా జోసెఫ్ విజయ్ అని మాత్రమే మెన్షన్ చేసి రిక్వెస్ట్ చేశాడట. అది గమనించిన కోర్టు కొంచం సీరియస్ అయ్యి తమిళ్ లో కొందరు నటులు రాజకీయాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగారని, వాళ్ళని ప్రజలు రియల్ హీరోలు అనుకుంటారని… టాక్స్ ఎగ్గొట్టడం అంటే జాతి వ్యతిరేక చర్య అవుతుందని…
సీరియస్ అవుతూ ఇలాంటి రిక్వెస్ట్ చేసినందుకు 1 లక్ష ఫైన్ వేస్తూ ప్రస్తుత మార్కెట్ ధర ఆ కారు కి 5 కోట్లు ఉన్నందున ఆ మొత్తాన్ని 2 వారాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ కి పంపించాల్సి ఉంటుందని అంటూ అల్టిమేటం ఇచ్చింది. దాంతో ఈ న్యూస్ బయటికి వచ్చినప్పటి నుండో సోషల్ మీడియా లో ట్రోల్స్ గట్టిగా జరుగుతున్నాయి. మరి దీనిపై విజయ్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.