Home న్యూస్ క్రేజీ అంకుల్స్ వీకెండ్ కలెక్షన్స్….అంత ప్రమోట్ చేసినా వచ్చింది ఇవే!

క్రేజీ అంకుల్స్ వీకెండ్ కలెక్షన్స్….అంత ప్రమోట్ చేసినా వచ్చింది ఇవే!

0

లాస్ట్ వీకెండ్ ఆడియన్స్ ముందుకు చాలా సినిమాలే వచ్చాయి. వాటిలో చిన్న సినిమాలే ఎక్కువగా ఉన్నప్పటికీ ఉన్న వాటిలో సోషల్ మీడియా లో వైడ్ రేంజ్ లో ప్రమోషన్స్ ను సొంతం చేసుకుని రిలీజ్ అయిన సినిమా శ్రీముఖి ప్రధాన పాత్ర్రలో తెరకెక్కిన క్రేజీ అంకుల్స్ సినిమా ముందు నిలిచే సినిమా, చిన్న సినిమా అయినా కానీ సోషల్ మీడియా లో తెగ ప్రమోషన్స్ ని మీమ్స్ రూపంలో ప్రమోషన్స్ ని….

తెగ సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 180 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి కంప్లీట్ గా నెగటివ్ రివ్యూలను సొంతం చేసుకుంది… ఇదేమి సినిమా రా బాబు అని…

చూసిన వాళ్ళు సినిమా పై నెగటివ్ కామెంట్స్ చేయగా ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ రూపంలో భారీగా ఎదురు దెబ్బ కొట్టింది. రిలీజ్ అయిన రోజున మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఇతర సినిమాలు కూడా భారీగానే ఉన్న కారణం వలన ఓపెనింగ్స్ ఏమాత్రం ఆకట్టుకునేలా రాలేదు.

ఫస్ట్ డే సినిమా 9 లక్షల గ్రాస్ ను రెండో రోజు 5 లక్షల గ్రాస్ ను మూడో రోజు 7 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సాధించగా మొత్తం మీద వీకెండ్ పూర్తీ అయ్యే టైం కి 22 లక్షల రేంజ్ లో గ్రాస్ ని 13 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా, అది కూడా నెగటివ్ షేర్స్ అండ్ డెఫిసిట్ లు లాంటివి…

పక్కకు పెట్టకుండా చెప్పిన కలెక్షన్స్. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ ఏమి పెద్దగా చేయలేదు, థార్డ్ పార్టీ బయర్స్ తో సినిమా ను ఓన్ గానే రిలీజ్ చేశారు. కానీ సినిమా బడ్జెట్ 1.2 కోట్ల దాకా ఉంటుందట. ప్రమోషన్స్ కోసమే మరో 15 లక్షల దాకా ఖర్చు చేశారట. ఆ లెక్కన చూసుకుంటే ప్రమోషన్ ఖర్చులు కూడా అతి కష్టం మీద వెనక్కి రాబట్టే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here