Home న్యూస్ చిన్న సినిమా అనుకున్నారు…సెన్సేషనల్ కలెక్షన్స్ తో కుమ్మేస్తున్న బాలీవుడ్ క్రూ మూవీ!!

చిన్న సినిమా అనుకున్నారు…సెన్సేషనల్ కలెక్షన్స్ తో కుమ్మేస్తున్న బాలీవుడ్ క్రూ మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మార్చ్ లాస్ట్ వీకెండ్ మూడు ఇండస్ట్రీలకు బాగా కలిసి వచ్చింది, టాలీవుడ్ నుండి సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) జోరు చూపించగా మలయాళ ఇండస్ట్రీ నుండి పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) చాలా టైం గా తీసిన సినిమా ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)(The Goat Life Movie)…

సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా బాలీవుడ్ నుండి అందరూ హీరోయిన్స్ ముఖ్య రోల్స్ లో నటించిన లేటెస్ట్ మూవీ క్రూ మూవీ కుమ్మేస్తుంది….టబు, కరీనాకపూర్ మరియు కృతి సనన్ ల కాంబోలో ఫిమేల్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ తో వచ్చిన క్రూ మూవీ(Crew Movie) ట్రైలర్ ఆకట్టుకున్నా కూడా….

సినిమా చిన్న సినిమానే అవ్వడంతో మినిమమ్ పర్వాలేదు అనిపించే రెస్పాన్స్ వచ్చినా కూడా గొప్ప విషయమే అనుకుంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో అంచనాలను మించి కలెక్షన్స్ ని అందుకుంది… మొదటి రోజు 10.28 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకోగా, రెండో రోజు 10.87 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించగా….

మూడో రోజు సినిమా 11.45 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకుని వీకెండ్ లో మొత్తం మీద 32.60 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోగా ఓవర్సీస్ లో 22 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా 60 కోట్ల లోపు గ్రాస్ తో ఎక్స్ లెంట్ గా జోరు చూపించింది.

చిన్న సినిమా అనుకున్నా సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఈ సినిమా దూసుకుపోతూ ఉండటం విశేషమని చెప్పాలి… ఇక వర్కింగ్ డేస్ లో కూడా సినిమా మంచి హోల్డ్ ని ఇలానే కొనసాగిస్తే లాంగ్ రన్ లో 100 కోట్ల రేంజ్ మార్క్ ని మొదటి వారంలోనే అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here