మొదటి వీకెండ్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) బ్రేక్ ఈవెన్ ని కూడా కంప్లీట్ చేసుకోగా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా 4వ రోజున ఎలాంటి హోల్డ్ ని చూపించింది అన్నది ఆసక్తిగా మారగా….
4వ రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ని చూపెడుతూ దూసుకు పోతుంది….తెలుగు రాష్ట్రాల్లో 3వ రోజుతో పోల్చితే 4వ రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ లో 50% రేంజ్ లోనే డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా కొన్ని చోట్ల బుకింగ్స్ బెటర్ గా ఉండటం విశేషం, ఇక ఓవర్సీస్ లో కూడా మంచి జోరుని చూపెడుతున్న సినిమా….
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే ఈ షేర్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర….
4.5 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉంది, ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి చూస్తూ ఉంటే వర్కింగ్ డే లో టిల్లు స్క్వేర్ మంచి హోల్డ్ ని చూపెడుతుంది ఇప్పుడు… ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇక…