Home న్యూస్ నాని దసరా ఫస్ట్ టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!!

నాని దసరా ఫస్ట్ టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!!

0

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దసరా… కంప్లీట్ మాస్ రగ్గుడ్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వస్తున్న ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా సినిమా మీద ఎక్స్ పెర్టేషన్స్ పెరిగేలా చేశాయి. ఇక సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద…

సినిమా రన్ టైం 2 గంటల 36 నిమిషాల రన్ టైంతో తెరకెక్కింది… కాగా సెన్సార్ వాళ్ళ నుండి సినిమా కి ఫస్ట్ టాక్ కూడా బయటికి రాగా టాక్ చాలా వరకు ఇంప్రెసివ్ గా ఉన్నప్పటికీ సినిమాకి కొంచం రంగస్థలం అలాగే పుష్ప సినిమాల పోలికలు ఉన్నాయని అంటున్నారు….

ఒక ఊరు, ఆ ఊరిలో మాస్ హీరో, ఆ ఊరి రాజకీయాల వలన ఏం కోల్పోయాడు, తర్వాత తన రివేంజ్ ఎలా తీర్చుకున్నాడు అన్నది స్టొరీ పాయింట్ కాగా ఇక్కడ వరకు రంగస్థలం, కొంచం పుష్పతో పోలికలు ఉన్నా హీరోయిన్ రోల్ మాత్రం కంప్లీట్ గా డిఫెరెంట్ గా ఉంటుందని, అదే మెయిన్ హైలెట్ అని అంటున్నారు…

మొత్తం మీద కంప్లీట్ మాస్ రగ్గుడ్ కంటెంట్ తో వస్తున్న సినిమా మాస్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెబుతూ ఉండగా క్లాస్ ఆడియన్స్ రెగ్యులర్ ఆడియన్స్ ఈ రగ్గుడ్ మాస్ మూవీని ఎంత ఓన్ చేసుకుంటారు అన్న దానిపై సినిమా ఏ రేంజ్ కి వెళుతుంది అన్నది తెలుస్తుందని అంటున్నారు. సెన్సార్ నుండి మాత్రం సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఇక ఆడియన్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here