Home న్యూస్ KGF2 ని లేపేసిన RRR….2022 ఇప్పుడు No1 ప్లేస్ RRRదే!!

KGF2 ని లేపేసిన RRR….2022 ఇప్పుడు No1 ప్లేస్ RRRదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2022 ఇయర్ లో ఇండియా లో రిలీజ్ అయిన మూవీస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ ముందు అద్బుతాలు సృష్టించింది కానీ హిందీ లో మరీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాక పోవడంతో కొత్త రికార్డులు అందుకోలేదు, కానీ అదే టైంలో కేజిఎఫ్ చాప్టర్ 2 తక్కువ గ్యాప్ తో రిలీజ్ అయ్యి అన్ని చోట్లా అద్బుతాలు సృష్టించి ఆర్ ఆర్ ఆర్ టోటల్ కలెక్షన్స్ గ్రాస్ ను….

RRR Movie 6 Days Total World Wide Collections!

క్రాస్ చేసి 2022 ఇయర్ కి గాను హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ గా నిలిచింది. అప్పటికి RRR మూవీ 1152.40 కోట్ల గ్రాస్ ను అందుకుంటే కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా 1233 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుని మంచి లీడ్ తో ఇయర్ టాపర్ గా నిలిచింది. కానీ తర్వాత ఏడాది చివర్లో ఆర్ ఆర్ ఆర్ మూవీ…

జపాన్ లో రిలీజ్ అవ్వడం, సినిమా అప్పటి నుండి ఇప్పటి దాకా కూడా కలెక్షన్స్ ని సాధిస్తూనే ఉండగా ఏకంగా 80 కోట్లకు పైగా గ్రాస్ ను ఇప్పటి వరకు అందుకోవడం, ఆస్కార్ టైంలో ఇండియాలో ఓవర్సీస్ లో రీ రిలీజ్ అవ్వడం తో అక్కడ నుండి 2.5 కోట్లు రాగా మొత్తం మీద ఇవన్నీ కలిపి సినిమా…

ఇప్పుడు 1236.50 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది. ఇందులో రీ రిలీజ్ కలెక్షన్స్ 2.5 కోట్లు తీసేసినా 1234 కోట్ల మార్క్ తో కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా కలెక్షన్స్ ని దాటేసి 2022 ఇయర్ కి నంబర్ 1 గ్రాసింగ్ మూవీ గా నిలిచి సంచలనం సృష్టించింది. జపాన్ లో ఈ రేంజ్ లో సినిమా రన్ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు, ఆస్కార్ కూడా రావడంతో ఇంకా జోరు కొనసాగించే అవకాశం ఎంతైనా ఉంది.

RRR Movie 4 Days Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here