Home న్యూస్ ఇంత ఫేక్ కలెక్షన్స్ ఏంటి సామి…అందరూ ట్రోల్ చేస్తున్నారు!!

ఇంత ఫేక్ కలెక్షన్స్ ఏంటి సామి…అందరూ ట్రోల్ చేస్తున్నారు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాల కలెక్షన్స్ పరంగా వచ్చిన గ్రాస్, షేర్ కలెక్షన్స్ పై అప్పుడప్పుడు కొంచం ఎక్కువ ప్రమోషన్స్ కానీ, రికార్డుల కోసం కానీ ఎక్కువ వసూళ్ళని పోస్టర్స్ లో చూపించడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కొన్ని సినిమాల కలెక్షన్స్ వచ్చిన వాటి కన్నా కూడా మరీ ఎక్కువగా చూపించడం జరిగింది, టాలీవుడ్ లో కొన్నేళ్ళ క్రితం కానీ లాస్ట్ 2 ఇయర్స్ లో కానీ కొన్ని సినిమాల కలెక్షన్స్ విషయం లో ఫేక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. అవి బాగా ట్రోల్ కూడా అయ్యాయి.

కలెక్షన్స్ విషయంలో ఎక్కువ లెక్కలను చూపించారు… కానీ మన ఇండస్ట్రీ కి మించి రీసెంట్ గా కన్నడ ఇండస్ట్రీ లో వచ్చిన సినిమాల కలెక్షన్స్ ని వచ్చిన కలెక్షన్స్ కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా చూపించిన సినిమాగా దర్శన్ హీరోగా నటించిన క్రాంతి సినిమా నిలిచింది.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన కబ్జా సినిమా కలెక్షన్స్ కూడా మూడు, నాలుగు రెట్లు ఎక్కువగా చెబుతున్నారు. సినిమా రెండు రోజుల్లో 25 కోట్ల లోపు గ్రాస్ నే అందుకుంటే టీం ఏకంగా 100 కోట్ల గ్రాస్ ను అందుకుందని మీడియాకి పోస్టర్స్ ను రిలీజ్ చేశారు…

ఆ పోస్టర్స్ చూసి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంత ఫేక్ ఏంటి అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. సినిమా కి ఆడియన్స్ నుండి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. మిక్సుడ్ టాక్ రావడం, కేజిఎఫ్ తో పోలికల వలన సినిమా ఏ దశలో కూడా ఆకట్టుకోలేకపోయింది… కానీ ఇలా ఫేక్ కలెక్షన్స్ వలన మరింత నేగిటివిటీ సినిమా పై ఎక్కువగా ఇంపాక్ట్ చూపబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here