2016 లో సోగ్గాడే చిన్ని నాయన మరియు ఊపిరి లాంటి బాక్ టు బాక్ హిట్స్ తో దుమ్ము లేపిన నాగార్జున తర్వాత హిట్స్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు మన్మథుడు 2 అంటూ సరికొత్త సినిమా తో రాబోతున్న కింగ్ ఎంతవరకు ప్రేక్షకుల మనసును గెలుచుకుంటాడు అన్నది ఆసక్తి గా మారింది. కాగా సినిమా బిజినెస్ ఓవరాల్ గా ఇప్పుడు 18.5 కోట్లు అవ్వడం తో సినిమా ఇప్పుడు 19.5 కోట్లు కలెక్ట్ చేయాలి.
ఇక అడ్వాన్స్ బుకింగ్స్ విషయానికి వస్తే 4 – 5 రోజుల ముందే సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయినా కానీ ఓవరాల్ బుకింగ్స్ మాత్రం యావరేజ్ గానే ఉన్నాయి అని చెప్పొచ్చు. కానీ ఒకసారి సినిమా కి టాక్ వస్తే షో షో కి కలెక్షన్స్ లో ఇంప్రూవ్ మెంట్ గట్టిగా ఉంటుంది.
ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ ఓవరాల్ గా 35% వరకు ఉండగా మార్నింగ్ షో సమయానికి టోటల్ గా 40 నుండి 45% వరకు వెళ్ళే అవకాశం ఉంది, ఓవరాల్ గా ఇవన్నీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ కాగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ ప్రస్తుతానికి యావరేజ్ గానే ఉన్నాయి.
ఈ బుకింగ్స్ తో మొదటి రోజు సినిమా 2.5 కోట్ల రేంజ్ షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఇక టాక్ బాగుంది ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యి షో షో కి కలెక్షన్స్ పెరిగే అవకాశం కూడా ఉండటం తో మొత్తం మీద సినిమా ఇది జరిగితే…
ఫస్ట్ డే 3.5 కోట్ల నుండి 4 కోట్ల వరకు షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, మరి కింగ్ నాగార్జున తన కెరీర్ లో కల్ట్ క్లాసిక్ అనిపించే మన్మథుడు సినిమా సీక్వెల్ మన్మథుడు 2 తో ఎలాంటి ఓపెనింగ్స్ ని బాక్స్ ఆఫీస్ బరిలో సొంతం చేసుకుంటాడో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.