Home న్యూస్ డే 11 కలెక్షన్స్…కొట్టాడు కానీ!!

డే 11 కలెక్షన్స్…కొట్టాడు కానీ!!

0

      యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర 10 రోజుల్లో టోటల్ గా 91.2 కోట్ల షేర్ తో దుమ్ము లేపగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ తో సెంసేషన్ ని క్రియేట్ చేస్తూ ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గాను బిగ్గెస్ట్ షేర్ ని వసూల్ చేసిన సినిమాగా ను నిలిచి సంచలనం సృష్టించగా సినిమా ఇప్పుడు 11 వ రోజు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు ని కొనసాగించింది అని చెప్పాలి.

సినిమా మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి టోటల్ గా 20% వరకు ఆక్యుపెన్సీ ని ఓవరాల్ గా సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ బాగుండగా సినిమా భారీ గా పుంజుకుంటుంది అని అంతా భావించారు.

కానీ సినిమా సక్సెస్ మీట్ ఈవినింగ్ అవ్వడంతో కలెక్షన్స్ పై అది ఎఫెక్ట్ చూపింది… కానీ మరీ ఎక్కువగా కాకున్నా ఓవరాల్ గా ప్రస్తుతం అందుతున్న రిపోర్ట్స్ ప్రకారం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11 వ రోజున రెండు రాష్ట్రాలలో 1.8 కోట్ల నుండి 2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఇక రామ్ నటించిన హెలొ గురు ప్రేమ కోసమే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు ని సాలిడ్ గా కొనసాగించింది. సినిమా నైజాం మరియు ఆంధ్రాలో సూపర్ స్టాంగ్ గా ఉండగా సినిమా మొత్తం మీద మరోసారి మంచి వసూళ్లతో రోజుని ముగించే ఛాన్స్ ఉంది.. మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ షేర్ ఖాయమని అంటున్నారు.

ఇక విశాల్ నటించిన పందెం కోడి 2 ఈ రోజు కూడా మంచి ఆక్యుపెన్సీ తో  మాస్ సెంటర్స్ లో జోరు చూపగా సినిమా మొత్తం మీద 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా 1 కోటి లోపు షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here