అరవింద సమేత Vs రంగస్థలం Vs భరత్ అనే నేను 10 డేస్ కలెక్షన్స్ కంపారిజన్

0
1250

       2018 ఇయర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాలను గమనిస్తే… పెద్ద హీరోలు నటించిన సినిమాలలో ఒకటి రెండు తప్పితే మిగిలిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించాయి. అందునా రంగస్థలం,భరత్ అనే నేను మరియు ఇప్పుడు అరవింద సమేత వీర రాఘవ సినిమా లు బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలన కలెక్షన్స్ తో అల్టిమేట్ రికార్డులను కూడా తిరగరాశాయి.

ఒక సారి ఈ మూడు సినిమాల 10 రోజుల కలెక్షన్స్ ని కంపేర్ చేసి చూస్తె ముందుగా రెండు రాష్ట్రాల కలెక్షన్స్ గురించి మాట్లాడితే… రంగస్థలం 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 67.26కోట్ల షేర్ ని అందుకోగా భరత్ అనే నేను ట్రేడ్ లెక్కల ప్రకారం 57.26 కోట్ల షేర్ ని అందుకుంది.

ఇక అరవింద సమేత వీర రాఘవ 10 రోజుల్లో 67.23 కోట్ల షేర్ ని అందుకుంది. రంగస్థలం కన్నా కేవలం మూడు లక్షలు మాత్రమే వెనకబడి ఉంది అరవింద సమేత. ఇక టోటల్ కలెక్షన్స్ ని కంపేర్ చేస్తే… రంగస్థలం 10 టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర…

91.5 కోట్ల షేర్ ని అందుకోగా భరత్ అనే నేను వరల్డ్ వైడ్ గా ట్రేడ్ లెక్కల ప్రకారం 83.62 కోట్ల షేర్ ని అందుకుంది. ఇక అరవింద సమేత వరల్డ్ వైడ్ గా 91.2 కోట్ల షేర్ ని వసూల్ చేసి రంగస్థలం కన్నా 30 లక్షలు వెనక ఉంది. రంగస్థలం ఓవర్సీస్ లో కుమ్మేస్తే… అరవింద సమేత కర్ణాటకలో దుమ్ము లేపింది.

ఇక టోటల్ గ్రాస్ ని కంపేర్ చేస్తే, రంగస్థలం 10 రోజుల్లో టోటల్ గా 148 కోట్ల గ్రాస్ ని అందుకోగా భరత్ అనే నేను ట్రేడ్ లెక్కల్లో 138 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇక అరవింద సమేత 10 రోజుల్లో 149 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్నట్లు సమాచారం.

ఇదీ మొత్తం మీద 10 రోజుల కలెక్షన్స్ కంపారిజన్. మొత్తం మీద రంగస్థలం మరియు అరవింద సమేతలు 10 రోజుల కలెక్షన్స్ లో నెక్ టు నెక్ జోరు చూపాయి. ఇక 11 వ రోజు హాలిడే తో అరవింద సమేత కొంత లీడ్ తీసుకున్నా వర్కింగ్ డేస్ లో ఎలా హోల్డ్ చేస్తుంది అనే దానిపై సినిమా ఎంత దూరం వెళుతుందో ఓ క్లారిటీ వస్తుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!