అక్కినేని అఖిల్ నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి వీకెండ్ ని పర్వాలేదు అనిపించే విధంగా ముగించి రెండు తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా సినిమా 10 కోట్ల వరకు షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది, దాంతో సినిమా మొదటి వీకెండ్ పర్వాలేదు అనిపించే విధంగా ముగియగా ఒకవేళ F2 సినిమా పోటి లో…
లేకుంటే మరింత బెటర్ గా సినిమా కలెక్షన్స్ వచ్చేవి అని చెప్పాలి, ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు తొలి వర్కింగ్ డే టెస్ట్ ను ఎదురుకోగా ఏమాత్రం జోరు అందుకోలేక పోయింది ఈ సినిమా. మూడో రోజు తో పోల్చితే నాలుగో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా…
ఏకంగా 70% శాతం పైగా డ్రాప్స్ ని అన్ని ఏరియాల్లో సొంతం చేసుకుంది, దాంతో సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో భారీ గ్రోత్ ని సాధిస్తేనే 4 వ రోజు మొత్తం మీద 60 నుండి 70 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే చాన్స్ ఉందని, లేకపోతె…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు మొత్తం మీద 50 లక్షల రేంజ్ లోనే వసూళ్లు అందుకోవచ్చు అని అంటున్నారు, ఇది సాలిడ్ దెబ్బ అనే చెప్పాలి, సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కూడా మినిమమ్….
1.2 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తూ కొనసాగితేనే లాంగ్ రన్ లో 23 కోట్ల టార్గెట్ ని అందుకునే అవకాశం ఉంది, మరి సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో జోరు చూపి అఫీషియల్ కలెక్షన్స్ లో ఏమైనా మ్యాజిక్ చేస్తుందో లేదో చూడాలి… న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.