నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు అదిరిపోయే కలెక్షన్స్ ను సాధించింది, 7 వ రోజు ఫైనల్ లెక్కలు ట్రేడ్ వర్గాలను కూడా షాక్ కి గురి చేశాయి, సినిమా 7 వ రోజు ఎలేక్షన్స్ పోలింగ్ డే అవ్వడంతో ఆ ఎఫెక్ట్ ఉంటుంది అనుకున్నా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో అనుకున్న లెక్క ని మించి పోయింది.
మినిమమ్ 1.5 అనుకుంటే 1.7 కోట్లు దాటే సూచనలు కనిపించగా ఫైనల్ లెక్క ఏకంగా 2 కోట్ల షేర్ మార్క్ ని దాటింది, మీడియం రేంజ్ మూవీస్ లో 7 వ రోజు రెండు రాష్ట్రాలలో ఇది బిగ్గెస్ట్ కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా 7 వ రోజు సినిమా..
ఏకంగా 2.16 కోట్ల షేర్ దాకా వసూల్ చేసి సంచలనం సృష్టించింది, ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నైజాం లో 7 వ రోజు కోటి కి పైగా షేర్ ని అందుకుని సత్తా చాటింది, మిగిలిన ఏరియాల్లో కూడా దుమ్ము లేపింది. ఫైనల్ ఏరియాల వారి కలెక్షన్స్ ని త్వరలో అప్ డేట్ చేస్తాం.