బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకున్న తర్వాత బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో వారంలో ఎంటర్ అవ్వగా 8 వ రోజు 5 లక్షలు మాత్రమే డ్రాప్ అయ్యి 46 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకున్న బంగార్రాజు సినిమా 9 వ రోజు వీకెండ్ అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ కూడా మరీ అనుకున్న రేంజ్ కి మించి గ్రోత్ ని ఏమి సొంతం చేసుకోలేదు…
3rd వేవ్ ఇంపాక్ట్ వలన యూత్ మాత్రమే థియేటర్స్ కి వస్తూ ఉండగా ఫ్యామిలీస్ చాలా తక్కువగానే థియేటర్స్ కి వస్తున్నారు. నైజాంలో డ్రాప్స్ కంటిన్యూ అవ్వగా కోస్టల్ ఆంధ్రలో పర్వాలేదు అని, సీడెడ్ లో ఓకే అనిపించేలా హోల్డ్ చేసిన బంగార్రాజు మొత్తం మీద 8 వ రోజు తో పోల్చితే…
9 వ రోజు గ్రోత్ ని అయితే చూపించి ఇప్పుడు 55 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునేలా కనిపిస్తుంది, అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే లెక్క 60 లక్షల దాకా వెళ్ళే అవకాశం ఉంది. కానీ బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉండగా సినిమా మొత్తం మీద గ్రోత్ చూపించడంతో ఆదివారం అలాగే 26th జనవరి హాలిడేస్ అడ్వాంటేజ్ ను వాడుకుంటే బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది.