Home న్యూస్ 1st డే కల్కి ఓపెనింగ్స్…..మమ్మోత్ రికార్డుల జాతర శురూ!!

1st డే కల్కి ఓపెనింగ్స్…..మమ్మోత్ రికార్డుల జాతర శురూ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కల్కి 2898AD(Kalki2898AD Movie) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ తో ఆల్ రెడీ ఇండస్ట్రీ రికార్డు బెండు తీసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా దుమ్ము దుమారం లేపడానికి సిద్ధం అవుతూ ఉన్న ఈ సినిమా….

తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకు పోతుంది…..నైజాంలో ఎపిక్ బుకింగ్స్ ని ఆక్యుపెన్సీని కొన్ని చోట్ల ఓవర్ ఫ్లోని సైతం సొంతం చేసుకున్న సినిమా ఆంధ్ర సీడెడ్ ఏరియాల్లో కూడా మంచి జోరుని ఇప్పుడు చూపిస్తూ ఉండగా ఆల్ మోస్ట్ నైజాం బుకింగ్స్ రికార్డ్ లెవల్ లో ఉండగా…

ఆంధ్ర సీడెడ్ బుకింగ్స్ ప్రభాస్ సలార్ రేంజ్ లో ఉండటంతో ఓవరాల్ గా డే 1 సలార్ ని మించే రేంజ్ లో ఉండే అవకాశం ఉంది. ఇక హిందీలో అనుకున్న దానికన్నా కూడా ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తున్న సినిమా తొలిరోజు సాలిడ్ కలెక్షన్స్ ని ఇక్కడ నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది…

ఇక కర్ణాటకాలో మరోసారి ప్రభాస్ రాంపెజ్ కనిపిస్తూ ఉండగా తమిళ్ కేరళలో ఆల్ మోస్ట్ సలార్ రేంజ్ కి కొంచం అటూ ఇటూగా ఓపెన్ కాబోతుంది సినిమా. ఓవర్సీస్ లో ఆల్ రెడీ రికార్డులు నమోదు చేసే రేంజ్ లో ఉండటంతో…. 

మొదటి రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్, హిందీలో 10-12 కోట్ల రేంజ్ లో షేర్ ఓపెనింగ్స్ ను కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 10 కోట్లకు పైగా షేర్ ఓపెనింగ్స్ ఓవర్సీస్ లో 25-28 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే…

అవకాశం ఇప్పుడు కనిపిస్తుంది. డే ఎండ్ వరకు ఇదే లెవల్ లో సినిమా ట్రెండ్ అయితే ఈ అంచనాలను సైతం సినిమా మించి పోయి మొదటి రోజు సాలిడ్ వసూళ్ళని పోస్ట్ చేసే అవకాశం ఉంది. ఇక డే ఎండ్ అయ్యే టైంకి సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here