బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో సౌత్ లో రెండు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన లేటెస్ట్ మూవీ విదాముయర్చి(Vidaamuyarchi) మరియు నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా నాగ చైతన్యతో పోల్చితే టాప్ స్టార్ అయిన అజిత్ కుమార్…
రీసెంట్ టైంలో అనుకున్న రేంజ్ లో ఆడియన్స్ ను అలరించలేకపోతున్నాడు, తన లేటెస్ట్ మూవీ పట్టుదల లో బజ్ తో రిలీజ్ అయ్యి మొదటి రోజు వరకు ఎక్స్ లెంట్ బుకింగ్స్ తో అజిత్ స్టార్ డంతో రచ్చ లేపినప్పటికీ కూడా తర్వాత టాక్ ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అవ్వక తప్పలేదు…
ఇక మరో పక్క డీసెంట్ టాక్ ను సొంతం చేసుకున్న తండేల్ మూవీ ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము లేపుతూ ఉండగా, తండేల్ డే 2 ఆన్ లైన్ టికెట్ సేల్స్ టాప్ స్టార్ అజిత్ పట్టుదల డే 3 బుకింగ్స్ ట్రెండ్ మీద డబుల్ గ్రోత్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి..
ఆల్ మోస్ట్ ప్రతీ గంట టికెట్ సేల్స్ పట్టుదల మీద డబుల్ టికెట్ సేల్స్ లీడ్ తో దూసుకు పోతున్న తండేల్ మూవీ సౌత్ లో ఇప్పుడు బెస్ట్ ట్రెండ్ అవుతున్న మూవీగా వీకెండ్ లో మాస్ రచ్చ చేయబోతుంది. ఆల్ రెడీ ఓపెనింగ్స్ పరంగా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తున్న సినిమా…
వీకెండ్ లో సాలిడ్ రికవరీని దక్కించుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు, మరో పక్క అజిత్ పట్టుదల మూవీ మిక్సుడ్ టాక్ తో తెలుగు లో రాష్ట్రాల్లో పూర్తిగా స్లో అవ్వగా తమిళ్ లో కూడా హెవీ డ్రాప్స్ ను సొంతం చేసుకుంటుంది. ఇక వీకెండ్ లో ఎంతవరకు రికవరీని సొంతం చేసుకుంటుందో చూడాలి.