Home గాసిప్స్ రెండో రోజే దిమ్మతిరిగే షాక్…డియర్ కామ్రేడ్ ని ఎంత ట్రిమ్ చేశారో తెలుసా?

రెండో రోజే దిమ్మతిరిగే షాక్…డియర్ కామ్రేడ్ ని ఎంత ట్రిమ్ చేశారో తెలుసా?

0

     సినిమా లెంత్ మరీ ఎక్కువగా ఉన్నా సినిమా స్క్రీన్ ప్లే ఎంత పెర్ఫెక్ట్ గా ఉంటే అంత లెంత్ ని చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడు నో చెప్పరు, రీసెంట్ టైం లో అలాంటి బిగ్ లెంత్ ఉన్న మూవీస్ కలెక్షన్స్ విషయం లో దుమ్ము లేపుతూ సంచలనాలు సృష్టించాయి. కానీ ఒక్కోసారి టాక్ అంత బాగా లేకపోతె సినిమా లో ఈ సీన్స్ బాలేవు ఆ సీన్స్ బాలేవు అంటూ కంప్లైంట్స్ వస్తు ఉంటాయి..

వాటిని ఎంత త్వరగా సరిదిద్దుకుంటే సినిమా కి అంత భారీ మొత్తంలో నష్టం జరగకుండా ఉంటుంది, యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

సినిమా ఒకసారి చూసేలా ఉన్నా కానీ లెంత్ విషయం లో ప్రతీ ఒక్కరు అంత లెంత్ తో కూడుకున్న స్లో స్క్రీన్ ప్లే ని చూడలేక పోయాం అంటూ తెగ కంప్లైంట్స్ ఇచ్చారు. దాంతో ఈ సినిమాను ఇలాగే స్లో గా చెప్పాలి అనుకున్నాం అంటూ అనౌన్స్ చేసిన టీం ఇప్పుడు…

ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నదే తడవుగా సినిమా లో బోర్ కొట్టించిన సీన్స్ ని తొలగించారు, అలా తొల గించిన సీన్స్ ని అన్ని కలిపితే సుమారు సినిమా లెంత్ లో 16 నిమిషాలు తగ్గిందని సమాచారం. ఇలా రిలీజ్ అయిన రెండో రోజే ట్రిమ్ అయిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా నిలిచింది డియర్ కామ్రేడ్.

ఇక సినిమా తొలగించిన సీన్స్ తర్వాత ఇప్పుడు ఫైనల్ గా రన్ టైం సుమారు 2 గంటల 33 నిమిషాల వరకు ఉంటుందని అంచనా. మరి ఈ ట్రిమ్ సీన్స్ హెల్ప్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు పెరుగుతుందో లేదో ఈ వీకెండ్ వసూళ్లు చూస్తె తెలిసిపోతుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here