Home న్యూస్ కార్తీ “దేవ్” బిజినెస్…టార్గెట్ ఇదే!

కార్తీ “దేవ్” బిజినెస్…టార్గెట్ ఇదే!

0

      ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న డబ్బింగ్ మూవీస్ లో క్రేజ్ కొంచం ఎక్కువ ఉన్న సినిమా దేవ్. కోలివుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న ఈ సినిమా లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది. మంచి అంచనాల నడుమ 14 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు లో కూడా భారీ గా రిలీజ్ కి సిద్దం అవుతుంది. కాగా సినిమా ఓవరాల్ గా…

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రివీల్ అయింది, సినిమా నైజాం లో 2.2 కోట్లు, సీడెడ్ లో 1.2 కోట్లు, ఆంధ్రా లో 3 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ ని సొంతం చేసుకుందని సమాచారం. దాంతో టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా..

సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ 6.4 కోట్ల రేంజ్ లో ఉంది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మినిమమ్ 7.4 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే తెలుగు రాష్ట్రాలలో క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక సినిమా తమిళ్ వర్షన్ కి గాను సాధించిన బిజినెస్..

క్లియర్ గా రివీల్ కాక పోయినా కానీ టోటల్ కౌంట్ 20 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం. దాంతో టోటల్ గా సినిమా తెలుగు తమిళ్ లో కలిపి 26.4 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు. ఇక ఇది వరకు కార్తీ నటించిన సినిమాల్లో…

ఖాకీ ఇక్కడ మంచి విజయాన్ని అందుకుని 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసింది. ఇక తర్వాత వచ్చిన చినబాబు తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా తెలుగు లో 6 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక ఇప్పుడు దేవ్ తో వస్తున్న కార్తీ ఎంతవరకు జోరు చూపుతాడో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here