Home న్యూస్ దేవదాస్ ప్రీమియర్ షో ఫస్ట్ టాక్

దేవదాస్ ప్రీమియర్ షో ఫస్ట్ టాక్

0

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ దేవదాస్ ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ నేడు వచ్చేసింది. రెగ్యులర్ షోల కన్నా ముందే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ని కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా. కాగా అక్కడ నుండి సినిమా కి వస్తున్న టాక్ ని ఒకసారి పరిశీలిస్తే…

స్టొరీ లైన్ మొత్తం చెప్పకున్నా…సింపుల్ గా ఒక దాదా ఒక డాక్టర్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్ కారణంగా కలుసుకుంటారు…తర్వాత వారి మధ్య స్నేహం…ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టొరీ ఒక చిన్న క్లాష్ వలన విడిపోతారు….తిరిగి ఎలా కలిసారు అన్నది అసలు సినిమా అని అంటున్నారు.

ఇలాంటి మల్టీ స్టారర్స్ లో స్టొరీ కన్నా ముఖ్యం స్క్రీన్ ప్లే…అక్కడే దర్శకుడు శ్రీరాం ఆదిత్య చాలా వరకు సక్సెస్ అయ్యాడని అంటున్నారు. కథ కన్నా కథనం ఎక్కువగా ఆకట్టుకుంటుందని అంటున్నారు. నాగార్జున చాలా యంగ్ గా కనిపించాడని అద్బుతంగా తన పాత్రని పోషించాడని అంటున్నారు.

ఇక నాని సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడని, హీరోయిన్స్ కూడా ఆకట్టుకున్నారని అంటున్నారు. మొత్తం మీద సినిమా లో మంచి ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ చాలా ఉన్నాయని అదే ప్లస్ పాయింట్ అని అంటున్నారు. ఓవరాల్ గా ప్రీమియర్ షోలతో సినిమాకి మంచి టాక్ లభించింది అని చెప్పొచ్చు.

ఇక రెగ్యులర్ ఆడియన్స్ నుండి అసలు సిసలు టాక్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here