Home న్యూస్ డిసాస్టర్ తర్వాత ఊచకోత…దేవర ఓవర్సీస్ రికార్డ్ బిజినెస్!

డిసాస్టర్ తర్వాత ఊచకోత…దేవర ఓవర్సీస్ రికార్డ్ బిజినెస్!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) ల కాంబోలో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సెన్సేషనల్ మూవీ అయిన దేవర(Devara Part 1) మూవీ ఆల్ మోస్ట్ ఇప్పుడు సమ్మర్ రేసు నుండి తప్పుకుని కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తూ ఉండగా….

సినిమా బిజినెస్ పరంగా ఆల్ రెడీ రచ్చ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా కొరటాల శివ డైరెక్ట్ చేసిన ప్రీవియస్ మూవీ ఆచార్య(Acharya Movie) లాంటి ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ తర్వాత వస్తున్న సినిమా అయినా కూడా…

RRR తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమా మీద అంచనాలు అయితే సాలిడ్ గానే ఉన్నాయి అని చెప్పాలి. దాంతో సినిమా బిజినెస్ ఆఫర్స్ అన్ని చోట్లా…

సాలిడ్ గా సొంతం అవుతూ ఉండగా సినిమా ఇప్పుడు ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ బిజినెస్ ను కంప్లీట్ చేసుకుందని సమాచారం. సినిమాకి మొత్తం మీద ఓవర్సీస్ లో అక్షారాలా 27 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుందని సమాచారం.

ఈ రేంజ్ బిజినెస్ ను ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు, ఇక సినిమా ఓవర్సీస్ లో ఓవరాల్ గా హిట్ అవ్వాలి అంటే 6.5 మిలియన్ డాలర్స్ కన్నా కూడా ఎక్కువ వసూళ్ళని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

ఇక సినిమా ఇతర చోట్ల కూడా బిజినెస్ సాలిడ్ గానే ఇప్పటి నుండే సొంతం చేసుకునే చేసుకుంటూ ఉండగా ఏప్రిల్ 5న రిలీజ్ అయితే రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ సినిమా ఇప్పుడు రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి కొత్త డేట్ ఏది ఫిక్స్ చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here