Home న్యూస్ దేవర రిలీజ్ పోస్ట్ పోన్….కారణాలు ఇవే!

దేవర రిలీజ్ పోస్ట్ పోన్….కారణాలు ఇవే!

0

2024 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే మూవీస్ లో బిగ్గీ అయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన సెన్సేషనల్ మూవీ దేవర(Devara Movie) మీద ఆల్ రెడీ సాలిడ్ గా హైప్ ఉన్న విషయం తెలిసిందే. సినిమా ఎప్పుడు వచ్చినా రికార్డుల జాతర సృష్టించడం ఖాయమని అందరూ ఎంతో ఆశగా సినిమా కోసం…

ఎదురు చూస్తూ ఉండగా సినిమా ఇప్పుడు రిలీజ్ ఏప్రిల్ 5న అవ్వడం లేదని స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తుంది… ఆల్ మోస్ట్ ఇది కన్ఫాం అనే సంకేతాలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. దానికి ఆంధ్రలో ఎలక్షన్స్ కోడ్ ఒక కారణం కానుండగా దానికి మించిన కారణం సినిమాలో మెయిన్ విలన్ రోల్ లో నటిస్తున్న…

సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan) కి సంభందించిన ఇంకా కీలక సన్నివేశాల షూటింగ్ జరగాల్సి ఉండగా రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ కారణంగా షూటింగ్ నుండి బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది సైఫ్ కి…కొన్ని వారాల పాటు అందుబాటులో ఉండే అవకాశం లేదని కూడా తెలుస్తూ ఉండటంతో….

ఆ పోర్షన్ షూటింగ్ తో పాటు కొంత VFX వర్క్ కూడా పెండింగ్ ఉండటంతో అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశం కనిపించక పోతూ ఉండటంతో సినిమాను ఇక పోస్ట్ పోన్ చేయక తప్పడం లేదని అంటున్నారు ఇండస్ట్రీలో….ఒకవేళ సైఫ్ తో సీన్స్ కాకుండా మిగిలిన సీన్స్ ని ఎంత ఫాస్ట్ గా తీసి VFX వర్క్ కూడా…

ఆన్ టైం కి కంప్లీట్ అయ్యి తర్వాత వెంటనే ఎన్టీఆర్ సైఫ్ ల సీన్స్ తీసి మార్చ్ వరకు సినిమా షూటింగ్ అయితేనే రిలీజ్ ఏప్రిల్ 5 న ఉంటుంది, ప్రస్తుతం దానికి అవకాశాలు ఎలా ఉన్నాయి అన్నది టీం డిస్కషన్స్ చేస్తున్నా పోస్ట్ పోన్ కే ఎక్కువ అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే అఫీషియల్ అప్ డేట్ రాబోతుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here