బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Movie) రీసెంట్ గా గ్రాండ్ రిలీజ్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న సినిమా…అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ స్టార్ట్ ను సొంతం చేసుకోగా…
రిలీజ్ కి వారాల ముందే ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేయగా అన్ని చోట్లా బుకింగ్స్ ఎక్స్ లెంట్ గా సాగుతున్న సినిమా నార్త్ అమెరికాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతుంది. నార్త్ అమెరికాలో కొన్ని లోకేషన్స్ లో హరికేన్ ఇంపాక్ట్ వలన…
ఎదురుదెబ్బ తగిలింది…ఆ లోకేషన్స్ లో సినిమా రిలీజ్ అయ్యి ఉంటే లక్షన్నర నుండి 2 లక్షల డాలర్స్ దాకా కలెక్షన్స్ వచ్చి ఉండేవి…ఇక సినిమా ఈ ఇంపాక్ట్ పడినా కూడా సినిమా ప్రీమియర్స్ కి గాను రిపోర్ట్ అయిన లోకేషన్స్ లో ఆల్ మోస్ట్ 2.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని…
అందుకుని మాస్ ఊచకోత కోసింది. నార్త్ అమెరికాలో ఆల్ టైం 3rd బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సినిమా సొంతం చేసుకోవడం కన్ఫాం అయ్యింది అని చెప్పాలి. రెండేళ్ళ క్రితం వచ్చిన RRR మూవీ సాధించిన ఎపిక్ రికార్డ్ ను ఈ ఇయర్ వచ్చిన కల్కి మూవీ బ్రేక్ చేసి టాప్ లో ఉండగా…
రెండో ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ నిలిచింది. ఇక ఇప్పుడు ఆల్ టైం టాప్ 3 ప్లేస్ లో దేవర మూవీ మాస్ భీభత్సం సృష్టించడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…ఇక ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో నార్త్ అమెరికాలో సెన్సేషనల్ వసూళ్ళని సినిమా అందుకునే అవకాశం ఉండగా లాంగ్ రన్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.