Home న్యూస్ రాజా ది గ్రేట్, క్రాక్ రికార్డ్ బ్రేక్ చేసిన ధమాకా…కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్!!

రాజా ది గ్రేట్, క్రాక్ రికార్డ్ బ్రేక్ చేసిన ధమాకా…కెరీర్ బిగ్గెస్ట్ రికార్డ్!!

0

మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీస్ ధమాకా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మొదటి వారాన్ని కంప్లీట్ చేసుకుంది. కాగా సినిమా మరీ అద్బుతమైన టాక్ ఏమి రాక పోయినా కానీ సినిమా ఇప్పుడు రవితేజ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని మొదటి వారంలో సొంతం చేసుకున్న సినిమాగా నిలిచి దుమ్ము దుమారం లేపింది ఇప్పుడు. రవితేజ కెరీర్ లో లాస్ట్ 5-6 ఏళ్లలో…

Dhamaka 1st Day Total World Wide Collections!

నటించిన సినిమాలు అన్నింటిలో కూడా రాజా ది గ్రేట్ మరియు క్రాక్ సినిమాలు హిట్ గీతని దాటగా ఇప్పుడు ధమాకా మూవీ మరో హిట్ గా నిలిచింది. ఇది వరకు క్రాక్ మూవీ మొదటి వారంలో 50% ఆక్యుపెన్సీతో… 22.76 కోట్ల షేర్ ని 38 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుంది.

Dhamaka 4 Days Total WW Collections!

ఇక అంతకన్నా ముందుకు వచ్చిన రాజా ది గ్రేట్ మూవీ రవితేజ కెరీర్ లో ఇది వరకు మొదటి వారంలో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమాగా 24.10 కోట్ల షేర్ ని అందుకోగా 40.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ రికార్డ్ ను…

Dhamaka 6 Days Total WW Collections!

రవితేజ లేటెస్ట్ మూవీ ధమాకా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో 25.22 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా 47.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని కెరీర్ బెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది. ఇక రవితేజ ధమాకా మూవీ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Dhamaka 1st Week (7 Days) Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here