మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే కోలివుడ్ ఆడియన్స్ టేస్ట్ కొంచం డిఫెరెంట్ గా ఉంటుంది, మిగిలిన ఇండస్ట్రీలలో ఇతర భాషల సినిమాలను ఆదరిస్తారు కానీ కోలివుడ్ లో చాలా కొన్ని సినిమాలు మినహాయిస్తే ఎక్కువ శాతం ఇతర భాషల సినిమాలను పట్టించుకోరు, అలాగే లోకల్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది, తమ భాషలో తమ వాళ్ళతోనే సినిమాలను ఎక్కువగా ఆదరిస్తారు అన్న అపవాదు కూడా కొద్ది వరకు ఉంది… ఇది ఇప్పుడు కొంచం నిజం చేస్తూ…
అక్కడ స్టార్స్ లో ఒకరైన ధనుష్ నటించిన లేటెస్ట్ మూవీ సార్ నిరూపించింది. సినిమా కి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. తమిళ్ లో కూడా టాక్ బాగున్నా కానీ డైరెక్టర్ అలాగే సినిమాలో ఎక్కువ శాతం తెలుగు కంటెంట్ లా అనిపించడంతో…
ఎంత టాక్ బాగున్నా హీరో వాళ్ళ వాడే అయినా కానీ ధనుష్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే సగం కూడా వసూళ్లు ఈ సినిమాకి రాలేదు…. ఇక సినిమా 3 వారాల్లో తమిళనాడులో 38.45 కోట్ల గ్రాస్ అందుకుంటే, మన వాళ్ళు ఏకంగా 3 వారాల్లో హీరో మనవాడు కాక పోయినా కానీ ఏకంగా…
38.60 కోట్ల దాకా గ్రాస్ ను తెలుగు రాష్ట్రాల నుండి అన్ సీజన్ లో కలెక్షన్స్ వచ్చేలా చేశారు…. దాంతో సొంత గడ్డపై కన్నా పరాయి గడ్డపై ధనుష్ సార్ కి ఇప్పుడు ఎక్కువ కలెక్షన్స్ ఓవరాల్ గా దక్కాయి అని చెప్పాలి…. ధనుష్ నటించిన లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ తిరు చిత్రం బలం తమిళనాడు నుండే 75 కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంటే ఇప్పుడు సార్ అందులో సగం కలెక్షన్స్ నే అందుకోవడం విచారకరం.