Home న్యూస్ సుశాంత్ లాస్ట్ మూవీ “దిల్ బెచారా” ట్రైలర్….ఎమోషనల్ లవ్ జర్నీ!!

సుశాంత్ లాస్ట్ మూవీ “దిల్ బెచారా” ట్రైలర్….ఎమోషనల్ లవ్ జర్నీ!!

0

కోట్లాది మంది ఫ్యాన్స్ ని ఎంతో ఎమోషనల్ గా మార్చేసిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య ను ఇప్పటికీ చాలామంది మర్చిపోలేక పోతున్నారు. ఇలాంటి టైం లో రోజు ఎదో విధంగా సుశాంత్ పేరు ట్విట్టర్ లో ట్రెండ్ అవుతూనే ఉండగా తను నటించిన చివరి సినిమా దిల్ బెచారా థియేటర్స్ లో ఎట్టి పరిస్థితులలో కూడా రిలీజ్ చేయాలని అందరూ గట్టిగా వాదించారు కానీ ప్రస్తుత పరిస్థితులు బాలేవు కాబట్టి…

సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తూ అందరూ చూసేలా సినిమాను ఫ్రీగానే టెలికాస్ట్ చేస్తామని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ చెప్పగా నేడు సినిమా అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ట్రైలర్ లో సుశాంత్ ని చివరి సారి చూస్తూ ప్రతీ ఒక్కరు ఎమోషనల్ అవుతున్నారు అని చెప్పాలి.

ఎంత అద్బుతంగా నాచురల్ నటనతో ట్రైలర్ లో సుశాంత్ ని చూస్తుంటే… ఆ ఒక్క రోజు తొందరపడకుండా ఉంటే బాగుండేది ధైర్యం చేసి ఉంటే బాగుండేది అని కోరుకొని ఫ్యాన్స్ లేరనే చెప్పాలి. ఇక దిల్ బెచారా ట్రైలర్ లో సినిమా స్టొరీ ఎలా ఉండబోతుందో ఆల్ మోస్ట్ రివీల్ చేశారు..

కాన్సర్ తో భాదపడే హీరోయిన్ లైఫ్ లో హీరో ఎంటర్ అయ్యాక జరిగే కథే ఈ సినిమా… ఎమోషనల్ టచ్ ఉన్నప్పటికీ కూడా కామెడీ సీన్స్ అండ్ క్యూట్ రొమాన్స్ ఆకట్టుకోగా ఏ ఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అద్బుతంగా ఉందని చెప్పాలి. ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్క్రీన్ ప్రజన్స్ అద్బుతం అనే చెప్పొచ్చు.

సినిమా ను ఈ నెల 24 న డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. ఇక సోషల్ మీడియా లో అందరూ ట్రైలర్ చూస్తూ ఎమోషనల్ అవుతుండగా ఈ ట్రైలర్ కి 24 గంటల్లో రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో వ్యూస్ అండ్ లైక్స్ తెప్పించాలని ఫిక్స్ అయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here