Home న్యూస్ లాస్ట్ మూవీ…థియేటర్స్ లో అనుకుంటే….షాక్ ఇచ్చారుగా!

లాస్ట్ మూవీ…థియేటర్స్ లో అనుకుంటే….షాక్ ఇచ్చారుగా!

0

లేట్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినీ లైఫ్ లో జరిగిన అనేక ట్రాజెడీలు మెల్లి మెల్లిగా ఇప్పుడు బయటికి వస్తున్నాయి. తన నుండి ఇతరులు లాక్కున్న సినిమా లు ఏంటి, ఎవరెవరు ఆ సినిమాలు చేశారు లాంటివి తెలియడం తో ఫ్యాన్స్ సోషల్ మీడియా లో రోజుకి ఒకరిని చొప్పున ట్రోల్ చేస్తున్నారు. సుశాంత్ చేయాలన్సిన చాలా సినిమాలు అనుకోకుండా లాస్ట్ మినట్ లో తన నుండి వేరే హీరోలకు వెళ్ళాయి.

రామ్ లీల, ఆశిఖి 2, బే ఫికరే, హాల్ఫ్ హర్ల్ ఫ్రెండ్ ఇలా అనేక సినిమాలు తన నుండి ఇతర హీరోలకు వెళ్ళిపోగా తానూ చేస్తున్న పాని, లాంటి బిగ్ మూవీస్ అనేక ఇబ్బందుల వలన ఆగిపోయాయి. ఇక తను నటించిన సినిమాల్లో…

కరణ్ జోహార్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్ తో చేసిన డ్రైవ్ సినిమా ను థియేటర్స్ లో రిలీజ్ చేయకుండా లాస్ట్ ఇయర్ అనేక కారణాలు చెప్పి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు. ఇక సుశాంత్ కెరీర్లో చేసిన చివరి సినిమా దిల్ బెచారా లేట్ అయినా పర్వాలేదు ఎట్టి పరిస్థితులలో… థియేటర్స్ లోనే రిలీజ్ చేయండి… అంటూ…

ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ట్రెండ్ చేసినా కానీ నిర్మాతలు ఇప్పుడు ఆ సినిమా ను వచ్చే నెల 24 న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు… ప్రతీ ఒక్కరు చూసేలా సినిమాను ఫ్రీ గానే అందరికీ చూపించబోతున్నామని అనౌన్స్ చేశారు. అంటే పెయిడ్ అకౌంట్ లేకుండానే సినిమాను అందరూ చూడొచ్చు అన్న మాట.

కానీ థియేటర్స్ లో రిలీజ్ అవుతేనే సుశాంత్ ని నిజమైన నివాళి ఇవ్వగలమని ఫ్యాన్స్ అంటున్నా… థియేటర్స్ ఇప్పుడే ఓపెన్ చేసే పరిస్థితులు లేవని… అప్పటికి అందరూ ఈ విషయాన్నీ మార్చిపోయి వాళ్ళ లైఫ్ లో బిజీ కూడా కావచ్చని…అందుకే ఈ నిర్ణయం తీసుకుని అందరూ చూసేలా ఫ్రీ గా చూపిస్తున్నామని చెప్పారు. దాంతో ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here