Home న్యూస్ సినిమాల ఫేక్ కలెక్షన్స్ దిల్ రాజు ఘాటు కామెంట్స్….!!

సినిమాల ఫేక్ కలెక్షన్స్ దిల్ రాజు ఘాటు కామెంట్స్….!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యే ప్రతీ సినిమా కి కొన్ని ఏరియాల్లో ప్రతీ రోజు వచ్చే కలెక్షన్స్ ఆయా ఏరియాల్లో ఉండే ట్రాకర్స్ రివీల్ చేస్తూ ఉంటారు, కానీ పెద్ద హీరోల సినిమాల విషయంలో అప్పుడప్పుడు చిన్న అండ్ మీడియం రేంజ్ మూవీస్ పరంగా కలెక్షన్స్ ని బయటికి చెప్పకుండా ఆపేసి తమకి నచ్చిన నంబర్స్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది… సినిమా పబ్లిసిటీలో అది భాగం అనుకుంటారు కానీ….

Tollywood Fastest 50k To 1M Likes Teaser Records

సోషల్ మీడియా లో అయితే వాటిపై నెగటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. స్టార్ హీరోల సినిమాల విషయంలో వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కి అవి బాగానే అనిపించినా ఇతర ఫ్యాన్స్ ఫేక్ అంటూ గొడవలు పెట్టడం కామన్ గా జరుగుతూ ఉంటుంది. ఇక పోస్టర్స్ పై కలెక్షన్స్ ని…

వదిలి రికార్డ్ రికార్డ్ అంటూ చెప్పుకోవడం పై కూడా ఎన్ని విమర్శలు వస్తున్నా అలాంటి పోస్టర్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే వస్తున్నాయి. ఇలాంటి ఫేక్ కలెక్షన్స్ పై టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు రీసెంట్ గా ఎఫ్ 3 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఘాటు వాఖ్యలు చేశారు….

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ఫేక్ కలెక్షన్లకు, తనకు ఎటువంటి సంబంధం లేదని, తాను డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించిన సినిమాల కలెక్షన్లను కూడా బయటకు వెల్లడించడం సరికాదని ఆయన అన్నారు. ఫేక్ కలెక్షన్ల వల్ల ఫ్యాన్స్ కు ఒక అరగంట ఆనందం ఉంటుందని అంతకు మించి ఒరిగేదేమీ లేదని ఆయన చెప్పుకొచ్చారు దిల్ రాజు… నైజాంలో దిల్ రాజు సినిమాలను ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఫేక్ కలెక్షన్స్ వెనక…

పోస్టర్స్ వెనుక దిల్ రాజు ఉంటారు అన్న కామెంట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంటాయి. అలాంటి కామెంట్స్ కి ఇలా ఇప్పుడు జవాబు చెప్పిన దిల్ రాజు ఎఫ్ 3 సినిమా మాత్రం టికెట్ హైక్స్ లేకుండా నార్మల్ రేట్స్ కే రిలీజ్ అవుతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ శాతం థియేటర్స్ కి వస్తారు అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here