బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్కో సినిమాతో ఒక్కో రిజల్ట్ ను సొంతం చేసుకుంటూ కెరీర్ ని కొనసాగిస్తున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా….తో మరో మంచి హిట్ ని సొంతం చేసుకుంటాడు అనుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ పరంగా…
ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించ లేక పోయింది. సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 45 లక్షల రేంజ్ లోనే షేర్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచింది. కిరణ్ అబ్బవరం నటించిన లాస్ట్ మూవీ క బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో…
బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఆ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2.45 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత వచ్చిన దిల్ రూబ సినిమా ఆ రేంజ్ లో కాకపోయినా ఆ రేంజ్ కి దగ్గరగా అయినా జోరు చూపిస్తుంది అనుకున్నా కూడా…
ఓవరాల్ గా రీసెంట్ టైంలో కిరణ్ అబ్బవరం నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్స్ ని గమనిస్తే…
#KiranAbbavaram Recent Movies 1st Day Collections(AP-TG)
👉#Dilruba- 45L~***
👉#KA Movie- 2.45CR
👉#RulesRanjann – 40L
👉#Meter – 30L~
👉#VinaroBhagyamuVishnuKatha – 1.35CR
👉#nenumeekubagakavalsinavadini – 35L
👉#Sammathame – 52L~
👉#sebastianpc524 – 40L
👉#SRKalyanamandapam – 1.41Cr
మొత్తం మీద క మూవీ తో కొండపైకి ఎక్కినా కూడా మళ్ళీ ఒక్క సినిమాతో నేల పైకి వచ్చినట్లు అయింది ఇప్పుడు….దిల్ రూబ మీద మంచి హోప్స్ పెట్టుకున్నా కూడా సినిమా ఓపెనింగ్స్ అంచనాలను అందుకోలేదు. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.