Home న్యూస్ దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? సూర్య పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!!

దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? సూర్య పై డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!!

0

కరోనా ఎఫెక్ట్ తో థియేటర్స్ అన్నీ మూసుకుని ఇప్పటికే 6 నెలలు కావొస్తుండగా ఈ ఇయర్ ఎండ్ వరకు పరిస్థితులు ఇలానే కొనసాగే అవకాశం ఎంతైనా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గక పోవడం తో ఇప్పట్లో థియేటర్స్ ఓపెన్ చేయలేని పరిస్థితులు నెలకొనగా… సినిమాలకు కోట్లు కోట్లు ఖర్చు చేసిన నిర్మాతలు వడ్డీలు చక్రవడ్డీలు కట్టుకోలేక బెటర్ డైరెక్ట్ రిలీజ్ ఆఫర్ వస్తే… సినిమాలను OTT కి అమ్మేస్తున్నారు.

బాలీవుడ్ లో ఇది ఎక్కువగా జరగగా సౌత్ లో చిన్న చితకా సినిమాలకే పరిమితం అవ్వగా రీసెంట్ గా తెలుగు లో ఒక పెద్ద సినిమా తమిళ్ లో మరో పెద్ద సినిమాలు డైరెక్ట్ రిలీజ్ కి సిద్ధం అయ్యాయి. తెలుగు లో పెద్దగా వ్యతిరేకత ఏమి రాలేదు కానీ..

తమిళ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు డైరెక్ట్ రిలీజ్ ని కన్ఫాం చేసుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండగా ఇప్పుడు తనతో సినిమాలు తీసిన డైరెక్టర్ హరి కూడా సూర్య నిర్ణయం పై వ్యతిరేకత ప్రకటించడం కోలివుడ్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

ఇలా థియేట్రికల్ రిలీజ్ లేకుండా ఓటీటీల్లో రిలీజ్ చేస్తే అసలైన ఎక్స్ పీరియెన్స్ ని అందమైన అనుహూతిని ప్రేక్షకులు మిస్సవుతారని, సూర్య లాంటి స్టార్ ఇలా సూర్య తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కూడా విజ్ఞప్తి చేశారు హరి. వెండితెర బ్లాక్ బస్టర్ల వల్లనే సూర్య పెద్ద స్టార్ అయ్యారని ఆయన గుర్తు దేవాలయాల్లాంటి థియేటర్లను వదిలేస్తారా? అంటూ నిలదీసాడు సింగం హరి.

తనతో వర్క్ చేసిన డైరెక్టర్ ఇలాంటి కామెంట్స్ చేయడం తో దీన్నే అదునుగా తీసుకుని మరింత మంది ఇప్పుడు తమ వాయిస్ ని పెంచుతున్నారట. మరో వర్గం మాత్రం సూర్య తో హరి సినిమా కాన్సిల్ అవ్వడం లేదా పోస్ట్ పోన్ అవ్వడం వలన హరి ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక దీనిపై సూర్య రియాక్షన్ ఇంకా రావాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here