Home న్యూస్ DJ టిల్లు రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

DJ టిల్లు రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

యూత్ లో మంచి అంచనాలను సొంతం చేసుకున్న సినిమా DJ టిల్లు, పోస్టర్స్, టీసర్, సాంగ్స్ మరియు ట్రైలర్ ఇలా అన్నీ ఓ రేంజ్ లో వర్కౌట్ అయ్యి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని యూత్ లో ఎక్స్ లెంట్ బజ్ ని సొంతం చేసుకున్న DJ టిల్లు బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన హీరో లోకల్ చిన్న చిన్న ఫంక్షన్స్ లో DJ కొడుతూ ఉంటాడు. అనుకోకుండా ఓ పబ్ లో హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. తర్వాత హీరోయిన్ కూడా ఇష్టపడగా అనుకోకుండా జరిగిన ఓ ఇంసిడెంట్ వలన….

హీరో ఓ మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుంది, ఇక అక్కడ నుండి DJ టిల్లు ఆ మర్డర్ కేసు నుండి ఎలా బయట పడ్డాడు అన్నది సినిమా కథ పాయింట్… సినిమా స్టొరీ పాయింట్ చాలా చిన్నది, ఒక లైన్ లో చెప్పేలా వీక్ గా ఉన్న స్టొరీ పాయింట్ ని తన సింగిల్ డైలాగ్స్ తో…

సిద్ధూ ఓ రేంజ్ లో DJ టిల్లు క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి హిలేరియస్ గా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశాడు, ఫస్టాఫ్ వరకు సినిమా అంచనాలను తగ్గట్లు ఆకట్టుకోగా సెకెండ్ ఆఫ్ లో మాత్రం కథ లేక పోవడంతో ఫోర్స్ కామెడీతో ట్రాక్ తప్పింది. కానీ చాలా వరకు సినిమా ఎంటర్ టైన్ మెంట్ విషయంలో సఫలం అవ్వడంతో ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా…..

మరీ ఇబ్బంది పెట్టేలా అయితే అనిపించలేదు… సిద్ధూ తన రోల్ కి 100% న్యాయం చేశాడు, నేహా శెట్టి కూడా బాగా ఆకట్టుకోగా మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి, తర్వాత డైలాగ్స్ కూడా మేజర్ ప్లస్ పాయింట్స్….. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ లో వీక్ గా ఉంది…

ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోగా డైరెక్షన్ విషయానికి వస్తే స్టొరీ పాయింట్ చాలా చిన్నది అయినా కానీ ఫస్టాఫ్ వరకు హిలేరియస్ గా వర్కౌట్ అయిన సినిమా సెకెండ్ ఆఫ్ ఫస్టాఫ్ రేంజ్ తో పోల్చితే అనుకున్న రేంజ్ లో లేదు కానీ ఓవరాల్ గా బాగుంది అనిపించేలా ఉంటుంది… సినిమా పై బజ్ పెరిగి పోవడం తో…

అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ఫస్టాఫ్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తారు కానీ సెకెండ్ ఆఫ్ కొంచం బోర్ కొట్టినా ఓవరాల్ గా మాత్రం సినిమా బాగుంది అనిపించేలా ముగుస్తుంది అని చెప్పాలి. సెకెండ్ ఆఫ్ ట్రీట్ మెంట్ కూడా ఫస్టాఫ్ లా ఉండి ఉంటే మరో రేంజ్ లో ఉండేది DJ టిల్లు సినిమా..మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here