అందరి అంచనాలను తలకిందలు చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి కి జోరు చూపుతుంది అనుకున్న ఎన్టీఆర్ బయోపిక్ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు రోజుల్లో కేవలం 14 కోట్ల లోపు షేర్ ని మాత్రమె సాధించగా సినిమా బడ్జెట్ కి గాను ప్రీ రిలీజ్ బిజినెస్ కి గాని ఈ కలెక్షన్స్ ఏమాత్రం సరిపోవు అన్న విషయం అందరికీ తెలిసిందే, ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం అసాధ్యంగానే కనిపిస్తున్నా…
ఈ రోజు నుండి అసలు సిసలు పండగ సెలవులు మొదలు అవ్వడం తో సినిమా ఎలా హోల్డ్ చేస్తుంది అన్నది పక్కకు పెడితే ఇది చావో రేవో తేల్చుకునే సమయం అనే చెప్పాలి. బాలయ్య అభిమానులు మొదటి రోజు ని భారీ గానే చూసినా తర్వాత అసలు సిసలు కామన్ ఆడియన్స్ మరియు…
ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సినిమా ని దూరం పెట్టారు, ఇప్పుడు పండగ సెలవులు ఉండటం తో తిరిగి వారు థియేటర్ వైపు అడుగులు వేసే అవకాశం ఉండటం తో ఎంతవరకు ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ అడ్వాంటేజ్ ని వాడుకుంటుంది అన్నది తెలియాల్సి ఉంది. రోజుకి మినిమమ్ 4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ సాధించే గ్రోత్ అయినా అవసరం అని చెప్పాలి.