స్టార్ కిడ్స్ కి లాంచింగ్ పాడ్ గా వచ్చిన లేటెస్ట్ మూవీ దొరసాని బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును త్వరగానే ముగించింది, సినిమా లో కొంచం కంటెంట్ ఉన్నా కానీ తెరకెక్కించిన విధానం చాలా నెమ్మదిగా ఉండటం తో కమర్షియల్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ ఈ స్లో నరేషన్ మూవీ ని పట్టించుకోలేదు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా డిసాస్టర్ గా మిగిలి పోయి పరుగును పూర్తి చేసుకుంది.
సినిమాను మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందించినట్లు సమాచారం, కాగా సినిమా ను మొత్తం మీద 2.6 కోట్లకు పైగా రేటు కి వరల్డ్ వైడ్ గా అమ్మారు. దాంతో మినిమం 3.5 కోట్ల లోపు టార్గెట్ తో బరిలోకి దిగిన దొరసాని మూవీ ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో…
1.13 కోట్ల షేర్ ని మాత్రమె రాబట్టింది, ఇక వరల్డ్ వైడ్ గా 1.29 కోట్ల షేర్ ని మాత్రమె అందుకున్న సినిమా ఫైనల్ గా బిజినెస్ లో సగం మాత్రమె వెనక్కి తీసుకు వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా పరుగును పూర్తి చేసుకుంది. లాంచింగ్ పాడ్ గా మారుతుంది అనుకున్న హీరో హీరోయిన్స్ ఇద్దరికీ తొలి అడుగు ఫ్లాఫ్ తోనే మొదలు పెట్టాల్సి వచ్చింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.