Home గాసిప్స్ 140 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా…తెలుగు రీమేక్ ని ఆపేశారా!!

140 కోట్ల బ్లాక్ బస్టర్ సినిమా…తెలుగు రీమేక్ ని ఆపేశారా!!

0
-advertisement-

ఒక భాషలో హిట్ అయిన మూవీస్ ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది, ఈ మద్య ఎక్కువగా సౌత్ మూవీస్ బాలీవుడ్ లో రీమేక్ లు అనౌన్స్ మెంట్ లు జరుగుతున్న విషయం తెలిసిందే, కానీ అక్కడ నుండి ఇక్కడ రీమేక్ అవ్వాల్సిన సినిమాలు చాలా లేట్ గా మొదలు అవుతూ ఉన్నాయి, లేటెస్ట్ గా ఈ కోవలోకే ఓ క్రేజీ మూవీ కూడా ఉందని చెప్పాలి.

-advertisement-

-advertisement-

ప్రీ కోవిడ్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఆయుష్మాన్ ఖురానా నటించిన డ్రీమ్ గర్ల్ బాక్స్ ఆఫీస్ దగ్గర 140 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని వసూల్ చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేయగా రీసెంట్ గా ఈ సినిమా సీక్వెల్ కూడా వచ్చి మెప్పించింది….కానీ మొదటి పార్ట్ తెలుగు లో రీమేక్ హక్కులను…

-advertisement-

-advertisement-

-advertisement-

అప్పుడే తీసుకున్నారు… తెలుగు లో ఈ సినిమాకి ఎవరు బాగా సెట్ అవుతారు అంటూ వెతికి చివరికి రాజ్ తరుణ్ ని ఎంచుకోగా… ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అని రాజ్ తరుణ్ కూడా భావించాడు, ఇంతలో కరోనా ఎంటర్ అవ్వడం తో ఈ సినిమా డిలే అవుతూ రాగా…

-advertisement-

ఈ గ్యాప్ లో రాజ్ తరుణ్ రీసెంట్ ఫామ్ ఏమాత్రం బాలేకపోవడం ఇతర హీరోల నుండి సానుకూల స్పందన రాక పోవడంతో రీమేక్ పై తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకుండా పోయింది అని చెప్పాలి…. తెలుగు లో ఇలాంటి కాన్సెప్ట్ కామన్ అనుకున్నారో…

లేక హీరో ఎవరూ సెట్ కాక పోవడం వలనో తెలియదు కానీ రీమేక్ పనులు మొత్తం ఆగిపోయాయి అని టాలీవుడ్ లో టాక్ గట్టిగా వినిపిస్తుంది, కాగా ఈ సినిమా సీక్వెల్ తో ఆయుష్మాన్ ఖురానా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ నే సొంతం చేసుకుని తిరిగి హిట్ ను దక్కించుకుని కంబ్యాక్ ఇవ్వడం విశేషం, ఇక తెలుగు రీమేక్ ఏమవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here