Home న్యూస్ పాపం రాజ్ తరుణ్….5 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

పాపం రాజ్ తరుణ్….5 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా హిట్ కి దూరం అయిపోయిన హీరోలలో యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా ఒకరు, కెరీర్ మొదలు పెట్టిన టైం లో వరుస పెట్టి విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర తక్కువ టైం లోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు కానీ తర్వాత టైం లో మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా సొంతం అవ్వక పోవడం తో….

వచ్చిన క్రేజ్ మొత్తం డౌన్ అవుతూ రాగా ఇప్పుడు రాజ్ తరుణ్ మూవీస్ ని జనాలు మినిమమ్ పట్టించుకోని పరిస్థితులు ఏర్పడ్డాయి అని చెప్పాలి. రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ మూవీ స్టాండ్ అప్ రాహుల్ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది అన్న విషయం కూడా…

చాలా తక్కువ మందికే తెలుసు అనే పరిస్థితి లో వచ్చిన ఈ సినిమా తొలి ఆటకే మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా… ఏ దశలో కూడా ఇక తేరుకోలేక పోయింది సినిమా… మొదటి రోజు మొత్తం మీద అతి కష్టం మీద 22 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలో…

సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత రోజుల్లో మరింత స్లో డౌన్ అయింది. మొత్తం మీద వీకెండ్ లో సినిమా తెలుగు రాష్ట్రాలలో 36 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 39 లక్షల షేర్ ని అందుకుంది, ఇక వర్కింగ్ డేస్ 2 రోజుల్లో సినిమా మరో 5 లక్షల మేర షేర్ ని అందుకోగా..టోటల్ గా 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో…

41 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 45 లక్షల దాకా షేర్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. సినిమా ఓవరాల్ బిజినెస్ వాల్యూ 1.5 కోట్ల దాకా ఉంటుందని ట్రేడ్ వర్గాల అంచనా… సినిమా ఆ మార్క్ ని అందుకునే అవకాశం లేక పోవడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర రాజ్ తరుణ్ కి మరో నిరాశ కలిగించే రిజల్ట్ ను ఇప్పుడు ఈ సినిమా ఇవ్వబోతుంది అని చెప్పాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here