Home టోటల్ కలెక్షన్స్ ది లెజెండ్: 45 కోట్లు పెట్టి సినిమా తీస్తే….వచ్చింది ఇది!!

ది లెజెండ్: 45 కోట్లు పెట్టి సినిమా తీస్తే….వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్న హీరోలే ఎక్కువ అయిపోయారు అంటే…. శరవణన్ స్టోర్స్ అధినేత శరవణన్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కించిన సినిమా ది లెజెండ్… ఆల్ మోస్ట్ 45 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించగా తమిళనాడుతో పాటు మిగిలిన చోట్ల భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేశారు. కానీ సినిమా తొలి ఆటకే తీవ్రంగా నిరాశ పరచగా, ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది బాక్స్ ఆఫీస్ దగ్గర…

తెలుగు లో సినిమా టోటల్ రన్ లో 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను ఆల్ మోస్ట్ 20 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ గా తమిళనాడులో రన్ కంప్లీట్ అయ్యే టైం కి 4.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

అన్ని వర్షన్ లు కలుపుకుని వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 7 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకోగా అందులో షేర్ ఒక 3.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా… అంటే 45 కోట్లు పెట్టి సినిమా తీస్తే పట్టుమని 3.5 కోట్ల షేర్ ని కూడా రికవరీ చేయలేక పోయింది ఈ సినిమా…

అదే టైం లో సినిమా కి అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ అండ్ డబ్బింగ్ రైట్స్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి 15 కోట్ల దాకా రికవరీ అయ్యిందని అంటున్నారు. టోటల్ బడ్జెట్ 45 కొట్లలో కలెక్షన్స్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ కలిపి 18.5 కోట్లు రికవరీ అవ్వగా టోటల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి…

26.50 కోట్ల రేంజ్ లో నష్టాలను సొంతం చేసుకుంది. ఈ రేంజ్ లో నష్టాలను సొంతం చేసుకున్నాక కూడా ఈ హీరో తన కొత్త సినిమాను త్వరలో మొదలు పెట్టబోతున్నట్లు అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here