Home న్యూస్ ది లెజెండ్: 45 కోట్ల సినిమా…..3 రోజుల్లో వచ్చింది ఇది!!

ది లెజెండ్: 45 కోట్ల సినిమా…..3 రోజుల్లో వచ్చింది ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ డబ్బింగ్ మూవీస్ భారీ లెవల్ లో రిలీజ్ అయ్యాయి. విక్రాంత్ రోణ బాక్స్ ఆఫీస్ దగ్గర కుమ్మేయగా మరో పక్క మరో భారీ బడ్జెట్ మూవీ ది లెజెండ్ సినిమా వరల్డ్ వైడ్ గా 2500 వరకు థియేటర్స్ లో భారీ ఎత్తున రిలీజ్ అయింది. సినిమా మొదటి రోజు తమిళనాడులో మంచి ఫుల్స్ పడ్డా కానీ జనాలు సినిమా థియేటర్స్ లో…

సీరియస్ సీన్స్ కూడా నవ్వుతూ ఎంజాయ్ చేశారు…. ఓవరాల్ గా సినిమా కి టాక్ కూడా తీవ్రంగా నిరాశ పరచగా తమిళనాడులో ఓపెనింగ్ డే న 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక మిగిలిన వర్షన్స్ అన్నింటితో కలిపి పట్టుమని…

3 కోట్లు కూడా వసూల్ చేయలేక పోయింది సినిమా. ఇందులో కూడా డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ తీసేస్తే కలెక్షన్స్ చాలా తక్కువే ఉంటాయి అంటున్నారు. ఇక సినిమా మూడు రోజుల్లో తమిళనాడులో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 4.2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకుందని అంటున్నారు.

ఇందులో తెలుగు రాష్ట్రాల్లో సినిమా మూడు రోజుల్లో పట్టుమని 20 లక్షల రేంజ్ లో కూడా గ్రాస్ ను అందుకోలేదని చెప్పాలి. చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు, నెగటివ్ షేర్స్ లాంటివి పడగా తెలుగు బిజినెస్ రేంజ్ కోటి రేంజ్ లో ఉండగా ఇక్కడ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది అనే చెప్పాలి. ఇక మొత్తం మీద 4 రోజుల ఎక్స్ టెండెడ్ వీకెండ్ లో…

వరల్డ్ వైడ్ గా 4.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమాను 45 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించగా బడ్జెట్ లో కేవలం 10% వరకే సినిమా రికవరీ చేసిందని చెప్పొచ్చు. ఇక మిగిలిన రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here