బాక్స్ ఆఫీస్ దగ్గర మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే కొంచం చిన్న ఇండస్ట్రీగా పేరున్న మలయాళ ఇండస్ట్రీలో కేరళలో మొదటి రోజు ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ మాత్రం కోలివుడ్ నంబర్ 1 హీరో అయిన దళపతి విజయ్(Thalapathy Vijay) పేరిట ఉంది. రెండేళ్ళ క్రితం వచ్చిన విజయ్ లియో(Leo Movie) మొదటి రోజు…
ఊహకందని కలెక్షన్స్ రికార్డులను అన్ని చోట్లా సొంతం చేసుకుని కోలివుడ్ తరుపున బిగ్గెస్ట్ డే 1 రికార్డ్ ను నమోదు చేయగా..కేరళలో ఓవరాల్ గా మొదటి రోజున ఆల్ టైం ఫస్ట్ డబుల్ డిజిట్ గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించింది… మలయాళ టాప్ స్టార్స్…
కూడా ఈ మార్క్ ని అందుకోలేక పోయారు…కానీ విజయ్ లియో మూవీ తో మొదటి రోజున ఏకంగా 11.90 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది…ఇక ఈ రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ అయ్యే అవకాశమే లేదని అందరూ అనుకుంటూ ఉండగా… ఇప్పుడు…
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(Mohan Lal) నటించిన లూసిఫర్(Lucifer Movie) సీక్వెల్ అయిన L2E – లూసిఫర్2(ఎంపురాన్)(Lucifer 2 – Empuraan) సినిమా ఈ రికార్డ్ ను బ్రేక్ చేసి కొత్త రికార్డును నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది….
రీసెంట్ గా సినిమా బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఆల్ టైం రికార్డ్ బుకింగ్స్ తో మాస్ భీభత్సం సృష్టిస్తున్న ఈ సినిమా ట్రెండ్ చూస్తుంటే లియో డే 1 రికార్డ్ ను బ్రేక్ చేసి కేరళలో బిగ్గెస్ట్ సింగిల్ డే రికార్డ్ ను నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది…ఆ రేంజ్ లో సినిమా మీద క్రేజ్ ఉండగా…
అక్కడితో పాటు వరల్డ్ వైడ్ గా కూడా రిమార్కబుల్ ట్రెండ్ సినిమా మీద కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా మళయాళ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను ఈ సినిమా నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మరి సినిమా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.