కోలివుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ మాస్టర్ సినిమా అక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ తో ఊచకోత కోసింది. సినిమా టాక్ అక్కడ కూడా యావరేజ్ లెవల్ లోనే వచ్చినప్పటికీ విజయ్ స్టార్ పవర్ ముందు ఆ టాక్ ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు సరికదా కలెక్షన్స్ ప్రవాహం మరింత పెరిగింది. ఇక విజయ్ సినిమా కన్నా కూడా బెటర్ టాక్ ని సొంతం చేసుకున్న శింభు నటించిన ఈశ్వరన్ సినిమా కి…
ఓపెనింగ్స్ పర్వాలేదు అనిపించే రేంజ్ లో వచ్చినప్పటికీ కూడా థియేటర్స్ కౌంట్ చాలా తక్కువ అవ్వడం తో కలెక్షన్స్ మరీ అనుకున్న రేంజ్ లో అయితే రాలేదు. మొత్తం మీద మొదటి వారాన్ని ఇప్పుడు పూర్తీ చేసుకున్న సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో…
ఫస్ట్ వీక్ ని పూర్తీ చేసుకుంది. సినిమా తమిళనాడు లో 7.25 కోట్ల బిజినెస్ ను సాధించగా వరల్డ్ వైడ్ గా 12 కోట్ల వరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది, తమిళ్ లో 14 కోట్ల గ్రాస్ రేంజ్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా 24 కోట్ల రేంజ్ గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా…
మొదటి వీకెండ్ 4 రోజుల్లో 8 కోట్ల దాకా గ్రాస్ ని తమిళ్ లో వరల్డ్ వైడ్ గా 13 కోట్ల దాకా గ్రాస్ ని వసూల్ చేసిందట. ఇక మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి తమిళనాడు లో సినిమా 11 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 18 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది అని అంటున్నారు. అంటే తక్కువ థియేటర్స్ లోనే సినిమా మంచి కలెక్షన్స్ ని సాధించింది అని చెప్పాలి.
ఇక సినిమా మాస్టర్ కి పోటిగా ఈ రేంజ్ వసూళ్ళని సొంతం చేసుకోవడం విశేషం కాగా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సినిమా తమిళనాడు లో మరో 3 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని అలాగే వరల్డ్ వైడ్ గా మరో 6 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాలి, రెండో వారం థియేటర్స్ ని పెంచుతున్నారని అంటున్నారు. దాంతో బ్రేక్ ఈవెన్ ని సినిమా సొంతం చేసుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.