Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో ఒకరైన నితిన్(Nithiin) నుండి ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చిన కొత్త సినిమా ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా ముందుగా ప్రీమియర్స్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకి…

అక్కడ నుండి ఎలాంటి టాక్ సొంతం అయ్యింది అన్నది ఆసక్తిగా మారగా కథని పూర్తిగా రివీల్ చేయకున్నా కానీ ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయిన హీరో లైఫ్ లో ఎదురైన పరిస్థితులు ఏంటి ఆ పరిస్థితులను హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ కథ పరంగా పెద్దగా ఇంప్రెస్ చేయకున్నా కానీ…

కామెడీ పరంగా కొంచం ఓవర్ ది టాప్ అనిపించినా కూడా కొన్ని చోట్ల కామెడీ బాగానే వర్కౌట్ అయిందని అంటున్నారు, ఎంటర్ టైన్ మెంట్ పరంగా చాలా వరకు ఆకట్టుకున్న సినిమా కథ పరంగా మాత్రం చాలా నార్మల్ స్టోరీ పాయింట్ తో వచ్చిన సినిమా అని అంటున్నారు. ఫస్టాఫ్ డీసెంట్ టైం పాస్ గా అనిపించిందని,…

కానీ సెకెండ్ ఆఫ్ మాత్రం కొంచం పడుతూ లేస్తూ సాగడంతో ఫస్టాఫ్ లో మాదిరిగా సెకెండ్ ఆఫ్ కామెడీ వర్కౌట్ అంతగా అవ్వలేదని అంటున్నారు, అయినా కానీ రెగ్యులర్ మాస్ అండ్ కామెడీ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ సినిమా నచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఓవరాల్ గా ప్రీమియర్స్ అయ్యే టైం కి…

సినిమాకి ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా టాక్ అయితే వినిపిస్తుంది, రెగ్యులర్ మూవీ అని ట్రైలర్ తోనే కన్ఫాం అయిన సినిమా ఎంటర్ టైన్ మెంట్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఓవర్సీస్ నుండి పర్వాలేదు అనిపించే టాక్ ను సొంతం చేసుకున్న సినిమా ఇక ఇక్కడ రెగ్యులర్ షోలకు ఎలాంటి టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here