Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

చాలా కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన నితిన్(Nithiin) నటించిన లేటెస్ట్ మూవీ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) ఆడియన్స్ ముందుకు భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకుంది. మరి ఈ సినిమాతో నితిన్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న హిట్ ని అందుకున్నాడో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే హీరో అవ్వాలని అనుకునే నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ అవుతాడు, అనుకోకుండా ఒక ఇంసిడెంట్ వలన ఇబ్బందులను ఫేస్ చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత కథ ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… చాలా రొటీన్ కథతో వచ్చిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో…

నితిన్ తన రోల్ వరకు బాగా నటించి మెప్పించాడు, డీసెంట్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు, కొన్ని యాక్షన్ సీన్స్ లో అదరగొట్టాడు, శ్రీలీల రోల్ చిన్నదే అయినా పర్వాలేదు అనిపించగా రావ్ రమేష్ రోల్ కొంచం ఓవర్ ది టాప్ అనిపించినా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది….మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…

సంగీతం ఏమాత్రం ఇంపాక్ట్ ని సినిమాను లిఫ్ట్ చేయలేక పోయింది, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా పెద్దగా ఇంపాక్ట్ ఫుల్ గా లేదు, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ వరకు పర్వాలేదు అనిపించేలా ఉన్నప్పటికీ కూడా సెకెండ్ ఆఫ్ మాత్రం చాలా నీరసంగా అనిపించింది, ఓవర్ ది టాప్ అనిపించేలా కొన్ని చోట్ల సీన్స్ పర్వాలేదు అనిపించినా…

కొన్ని చోట్ల విసుగు తెప్పిస్తాయి… సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే మెప్పించాయి. వక్కంతం వంశీ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ పరంగా ఏమి కొత్తదనం ఉండదని ట్రైలర్ లోనే కన్ఫాం అయినా ఎంటర్ టైన్ మెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నా అది కొన్ని సీన్స్ కే పరిమితం అవ్వగా…

బాగా ఎక్స్ పెర్ట్ చేసిన రాజశేఖర్ రోల్ కూడా జస్ట్ ఓకే అనిపించింది. ఫస్టాఫ్ వరకు వక్కంతం వంశీ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో చేయడానికి పెద్దగా ఏమిలేక పోయింది.. దాంతో సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ పరంగా పర్వాలేదు అనిపించినా టోటల్ కథ ఏమి లేకపోవడంతో ఏమాత్రం ఇంపాక్ట్ ని చూపించలేదు…

మొత్తం మీద పర్వాలేదు అనిపించేలా ఉన్న ఫస్టాఫ్, కొన్ని చోట్ల వర్కౌట్ అయిన కామెడీ, కొన్ని చోట్ల యాక్షన్ సీన్స్ బాగానే ఆకట్టుకోవడంతో పడుతూ లేస్తూ సాగినా ఇలాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్స్ నచ్చే ఆడియన్స్ కి సినిమా పర్వాలేదు అనిపించేలా మెప్పించవచ్చు… కానీ కొత్త కథలు కోరుకునే ఆడియన్స్…

మంచి ఎంటర్ టైన్ మెంట్ ని ఎంజాయ్ చేసే ఆడియన్స్ కొంచం ఓపిక ఎక్కువ చేసుకుని చూడాల్సిన అవసరం ఉంది ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాను… ఓవరాల్ గా నితిన్ నుండి అందరూ ఎదురు చూస్తున్న మూవీ అయితే కాదు కానీ ఉన్నంతలో మాస్ ఆడియన్స్ ను కొద్దివరకు ఆకట్టుకోవచ్చు… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here