Home న్యూస్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ థియేటర్స్, బుకింగ్స్…డే 1 ఎంత రావొచ్చు అంటే!!

ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ థియేటర్స్, బుకింగ్స్…డే 1 ఎంత రావొచ్చు అంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ స్టార్ నితిన్(Nithiin) హిట్ కొట్టి చాలా కాలామే అవుతుంది, ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ అయిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man Movie) భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ ఓవరాల్ గా…

పర్వాలేదు అనిపించేలా ఉండగా బిజినెస్ పరంగా ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా సాలిడ్ బిజినెస్ నే సొంతం చేసుకున్న నితిన్ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ను ఆశిస్తున్నాడు. సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 1100 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 25 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ టికెట్ సేల్స్ గ్రాస్ 1 కోటి రేంజ్ లో ఉండగా కమర్షియల్ ఎంటర్ టైనర్ అవ్వడంతో థియేటర్స్ దగ్గర స్పాట్ బుకింగ్స్ ఎక్కువగా సొంతం చేసుకునే అవకాశం ఉంది.

నితిన్ రీసెంట్ మూవీస్ రిజల్ట్ ఎలా ఉన్నా ఓపెనింగ్స్ డీసెంట్ గానే ఉంటూ వస్తూ ఉండటంతో ఈ సినిమా కూడా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ అండ్ పోటిని బట్టి చెప్పాలి అంటే 2.8 కోట్ల నుండి 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.

ఒకవేళ యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని షో షోకి కలెక్షన్స్ లో జోరు చూపిస్తే లెక్క పెరిగే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా అంచనాలను మించుతుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here