Home గాసిప్స్ 7 న రిలీజ్ కానున్న ట్రాన్స్….తెలుగు డబ్ బిజినెస్ ఇదే!

7 న రిలీజ్ కానున్న ట్రాన్స్….తెలుగు డబ్ బిజినెస్ ఇదే!

566
0

ఆహా వీడియో… కంప్లీట్ తెలుగు మూవీస్ యాప్ గా వచ్చిన అల్లు అర్జున్ కొత్త స్ట్రీమింగ్ యాప్ మెల్లి మెల్లిగా తన మార్క్ ని చూపెడుతూ మిగిలిన స్ట్రీమింగ్ యాప్స్ కి ధీటు గా దూసుకు పోతుంది. మిగిలిన యాప్స్ అన్నీ పెద్ద సినిమా లు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న కొత్త సినిమాలను కొంటూ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తుంటే కొత్తగా ట్రై చేయాలని ఫిక్స్ అయిన ఆహా యాప్ వాళ్ళు మాత్రం…

ఆల్ రెడీ మంచి రిజల్ట్ ని క్రేజ్ ని సొంతం చేసుకున్న ఇతర ఇండస్ట్రీల సినిమాలను సోషల్ మీడియా క్రేజ్ ప్రకారం ఎంక్వైరీ చేసి ఆ సినిమాల తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ఫ్యాన్సీ రేటు చెల్లించి దక్కించుకుని ఇక్కడ డబ్బింగ్ వర్క్ ని త్వర త్వరగా కంప్లీట్ చేసి…

ఒక్కో సినిమాను ఒక్కో వారం ఇక్కడ రిలీజ్ చేస్తున్నారు. లాస్ట్ వీకెండ్ లో మంచి సైకో థ్రిల్లర్ అయిన ఫోరెన్సిక్ మూవీ ని ఇక్కడ రిలీజ్ చేయగా ఈ ఏడాది వచ్చిన మరో డిఫెరెంట్ మూవీ ట్రాన్స్ ని ఇప్పుడు ఆగస్టు 7 న ఇక్కడ తెలుగు డబ్ వర్షన్ ని రిలీజ్ చేయబోతున్నారు.

ఫహద్ ఫాజిల్, నజ్రియా నజిం, గౌతమ్ మీనన్ లాంటి మంచి స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమా ఫస్టాఫ్ కుమ్మేసినా సెకెండ్ ఆఫ్ మాత్రం అంచనాలను పూర్తిగా అందుకోలేక మలయాళంలో జస్ట్ ఓకే అనిపించే రిజల్ట్ ని సొంతం చేసుకుంది. కానీ కాన్సెప్ట్ యూనిక్ గా ఫ్రెష్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆడియన్స్ ని మెప్పించే అంశాలు…

సినిమాలో బాగా ఉండటం తో సినిమా కి తెలుగు డబ్బింగ్ రైట్స్ కింద 1.2 కోట్ల రేంజ్ రేటు చెల్లించి తెలుగు డబ్బింగ్ రైట్స్ హక్కులను దక్కించుకున్నారట. ఇక్కడ తెలుగు డబ్ ప్రాసెస్ కి మరో 10 లక్షల రేంజ్ లో ఖర్చు అయినట్లు ట్రేడ్ లో టాక్ ఉంది. మరి సినిమా ఇక్కడ ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుందో 7న తేలనుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here