Home న్యూస్ కొత్త సినిమాలను మించిన రీ రిలీజ్…5 రోజుల్లో గిల్లి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

కొత్త సినిమాలను మించిన రీ రిలీజ్…5 రోజుల్లో గిల్లి రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలు ఏమాత్రం ఇంపాక్ట్ ను చూపించ లేక పోతున్న చోట ఇప్పుడు తమిళనాడులో రీ రిలీజ్ మూవీ కొత్త సినిమాల రేంజ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ ఉండటం విశేషం, కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన ఒక్కడు రీమేక్ మూవీ అయిన…

గిల్లి(Ghilli Re Release Collections) ….రీ రిలీజ్ అయ్యి రిమార్కబుల్ కలెక్షన్స్ తో ప్రీవియస్ రీ రిలీజ్ రికార్డ్ బ్రేకింగ్ మూవీ అయిన ఖుషి కలెక్షన్స్ ని మొదటి రోజే బ్రేక్ చేసి సంచలనం సృష్టించగా వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉన్న ఈ సినిమా వీకెండ్ తర్వాత స్లో అవుతుంది అనుకున్నా కూడా…

వర్కింగ్ డేస్ లో కూడా కొత్త సినిమాలకు ధీటుగా బుక్ మై షోలో బుకింగ్స్ ను సొంతం చేసుకోగా తమిళనాడులో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు 5 రోజుల్లో ఏకంగా 17.6 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంది…. ఒకసారి సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…

Ghilli Movie Re Release 5 Days Total Collections
👉Tamilnadu – 12.25Cr
👉Karnataka- 0.80Cr~
👉ROI – 0.50Cr~
👉Overseas – 4.15CR~***
Total WW Collections – 17.70CR~ GROSS

ఆల్ మోస్ట్ ఒక కొత్త సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో ఆ రేంజ్ లో ఈ సినిమా హోల్డ్ ని చూపిస్తుంది. రీ రిలీజ్ మూవీస్ లో మొదటి రోజు తర్వాత డబుల్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమానే లేదు, కానీ ఇప్పుడు గిల్లి ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి 20 కోట్ల నుండి అన్నీ అనుకున్నట్లు జరిగితే 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను లాంగ్ రన్ లో అందుకునే దిశగా అడుగులు వేస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here