యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) భారీ ఆశలు పెట్టుకున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star Movie), సమ్మర్ లో రిలీజ్ అయిన పెద్ద సినిమా ఇదే కాగా ఆడియన్స్ ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో సినిమా తీవ్రంగా విఫలం అయ్యింది. ఏ దశలో కూడా టార్గెట్ ను అందుకునే దిశగా…
పరుగును కొనసాగించ లేక పోయిన ఈ సినిమా ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. 90 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఆ బడ్జెట్ కి ఏమాత్రం న్యాయం అయితే చేయలేక పోయింది అని చెప్పాలి. ఇక రీసెంట్ టైంలో ఏ సినిమా అయినా బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత…
నెల గ్యాప్ లో డిజిటల్ రిలీజ్ కాబోతూ ఉండగా ఇప్పుడు అందరికీ షాకిస్తూ ది ఫ్యామిలీ స్టార్ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన 3 వారాల టైం కే డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటుకి కొన్న అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ముందు సినిమా డిజిటల్ రిలీజ్ ను…
మే 3కి అనౌన్స్ చేసినా కూడా సినిమా ఆల్ మోస్ట్ రన్ ఎండ్ అవ్వడంతో త్వరగా డిజిటల్ రిలీజ్ చేస్తే కొంచం ఎక్కువ రేటు వస్తుంది కాబట్టి నష్టాలను ఎంతో కొంత తగ్గించుకోవడానికి ఇలాంటి నిర్ణయం ఇప్పుడు మేకర్స్ తీసుకున్నారని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ లో ఈ నెల…
26న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా అక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర విజయ్ దేవరకొండ హిట్ కోసం వేట ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పాలి ఇప్పుడు.